ది బాస్‌  లో  శ్రియశరణ్ !

శ్రియ కథానాయికగా వైవిధ్యమైన పాత్రలతో పాటుగా కమర్షియల్‌ గెటప్‌లు వేశారు. ఆండ్రీ కొచ్చివ్‌తో గత ఏడాది శ్రియ వివాహం జరిగింది. చిన్న బ్రేక్‌ తర్వాత ఓ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేయడానికి శ్రియ మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. ఆర్‌. మాదేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సండక్కారి: ది బాస్‌’ సినిమాలో శ్రియ నటిస్తున్నారని కోలీవుడ్‌ టాక్‌. శ్రియ నటించిన తమిళ చిత్రం ‘నరగాసురన్‌’, హిందీ చిత్రం ‘తడ్కా’ విడుదల కావాల్సి ఉంది.