మిల్కీ బ్యూటీకి మండిన‌ట్టుందే!

Thammanah

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గ‌త ప‌దేళ్లుగా తెలుగులో క్రేజీ క‌థానాయిక‌గా కొనసాగుతోంది. `బాహుబ‌లి` త‌రువాత మ‌రింత పాపుల‌ర్ అయిన త‌మ‌న్నాఆ స్థాయిలో మాత్రం అవ‌కాశాల్ని సొంతం చేసుకోలేక‌పోతోంది. హీరోయిన్‌గా న‌టిస్తూనే మ‌రో ప‌క్క క్రేజీ స్టార్‌ల చిత్రాల్లో స్పెష‌ల్ గీతాల్లో తుళుక్కున మెరుస్తోంది. త‌మ‌న్నా ప్ర‌త్యేక గీతాల‌కు క్రేజ్ వుండ‌టంతో స్టార్ డైరెక్ట‌ర్‌లు త‌మ‌న్నాకు హీరోయిన్ అవ‌కాశాల కంటే స్పెష‌ల్ ఐట‌మ్ నంబ‌ర్‌ల‌కే ప్రాధాన్య‌త‌నిస్తున్నారు.

జై ల‌వ‌కుశ‌, కేజీఎఫ్‌, స‌రిలేరు నీకెవ్వ‌రు ఇలా వ‌రుస క్రేజీ చిత్రాల్లోని స్పెష‌ల్ గీతాల్లో న‌టించే అవ‌కాశాల్ని సొంతం చేసుకుంది. తాజాగా `సైరా`లో లక్ష్మిగా ఆక‌ట్టుకున్న‌ త‌మ‌న్నా త‌మిళంలో హీరో విశాల్‌తో క‌లిసి `యాక్ష‌న్‌` చిత్రంలో న‌టించింది. హీరోతో పోటీప‌డి మ‌రీ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో కనిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన మిల్క్ బ్యూటీ ఈ చిత్రంలోని ఓ పాట‌లో గ్రీన్ స్విమ్ సూట్ లాంటి బికినీ డ్రెస్‌లో క‌నిపించి షాకిచ్చింది. త‌మన్నా ఏంటి? ఇలాంటి డ్రెస్ వేయ‌డం ఏంట‌ని అంతా అవాక్క‌య్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో త‌మ‌న్నాపై నెటిజ‌న్స్ ఫైర్ అయ్యారు.

దీంతో త‌మ‌న్నాకు మండింది. త‌న‌పై విరుచుకుప‌డిన వారిపై ఘాటుగా స్పందించింది. న‌టీన‌టులు క‌థ‌కు అనుగుణంగా స‌న్నివేశం డిమాండ్ మేర‌కు న‌టించ‌డానికి సిద్ధ‌ప‌డాలి. ఆ స‌న్నివేశంలో ఎలాంటి డ్రెస్ వేసుకోవాల‌ని ద‌ర్శ‌కుడు, క‌థ డిమాండ్ చేస్తే అవే ధ‌రించాలి. అలా చేసిన‌ప్పుడే న‌టులుగా త‌మ వృత్తికి న్యాయం చేసిన వాళ్లం అవుతాం. ఇప్ప‌టికైనా ఈ అర్థంలేని చ‌ర్చ‌ని ఆపేయండి` అని నెటిజ‌న్స్‌కి చుర‌క‌లంటించింది. 

Thamannah fires on Netizens. When the netizens commented on her bikini, Thammanah replied, she wears costumes as per the character needs.