ఓటిటి : “ఎఫ్ 3” సినిమాని ఏ స్ట్రీమింగ్ యాప్ లో చూడొచ్చంటే…!

ఈ ఏడాదికి మన టాలీవుడ్ సినిమా దగ్గర మంచి అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో లేటెస్ట్ క్రేజీ సీక్వెల్ చిత్రం “ఎఫ్ 3” కూడా ఒకటి. వెంకీ మామ అలాగే యంగ్ వరుణ్ తేజ్ లు నటించిన ఈ సినిమాని దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించాడు. అయితే దీనికి ముందు తెరకెక్కించిన “ఎఫ్ 2” సినిమా భారీ కావడంతో ఈ సినిమా కోసం ఆడియెన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది.

ఇక ఎట్టకేలకు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యిన ఈ చిత్రం పై లేటెస్ట్ సమాచారం ఒకటి బయటకి వచ్చేసింది. గతంలో ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు సొంతం చేసుకోగా ఈసారి ఎఫ్ 3 ని మాత్రం ఇంటర్నేషనల్ సంస్థ సోని లివ్ వాళ్లు కొనుగోలు చేశారట.

అలాగే ఈ సినిమాకి గాను భారీ మొత్తం లోనే చెల్లించి తీసుకోగా రిలీజ్ అయ్యిన కొన్ని వారాల తర్వాత ఆడియెన్స్ కోసం స్ట్రీమింగ్ కి తీసుకొస్తారట. ఇంకా ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ అలాగే సోనాల్ చౌహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అలాగే దిల్ రాజు నిర్మాణం వహించారు.