దేవుడు ఎన్నో ఇచ్చాడు.. ఇంకెన్నో తీసుకెళ్లాడు : తేజస్వీ

Tejaswi Madivada ABout Her Roommates

బిగ్ బాస్ ఫేమ్ తేజస్వీ జీవితం తెరిచిన పుస్తకమే. ఈ షో తేజస్వీ జీవితాన్ని మార్చేసింది. అంతకు ముందున్న క్రేజ్‌కు షోలో పార్టిసిపేట్ చేశాక వచ్చిన క్రేజ్ పూర్తి భిన్నంగా ఉంది. అయితే షోలో తేజస్వీ తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలు కూడా చెప్పింది. తను ఒంటరిగా ఉంటానని, నా అనుకున్న వారు ఎవ్వరూ లేరని, తండ్రి కూడా మంచివాడు కాదని, అందుకే కాదనుకుని వదిలేసి వచ్చి ఒంటరిగా బతుకుతున్నాని ఎంతో ఎమోషన్ అయ్యేది.

Tejaswi Madivada ABout Her Roommates
Tejaswi Madivada ABout Her Roommates

ఇక ప్రస్తుతం తేజస్వీ తన స్నేహితులతోనే కలిసి ఉంటుంది. సోషల్ మీడియాలో తేజస్వీని ఫాలో అయ్యే వారికి ఈ విషయం అర్థమవుతుంది. తేజస్వీ లైఫ్ స్టైల్ ఏంటి? ఆమె స్నేహితులు ఎలా ఉంటారు? ఆమె ఎలా ఎంజాయ్ చేస్తుంది? అనే విషయాలు ఆమెను ఫాలో అయ్యే వారికి ఇట్టే తెలిసిపోతుంది. ట్రావెలింగ్, బీచ్‌లు అంటే ఎంతో ఇష్టమని చెప్పుకునే తేజస్వీ వాటిని ఎంతో మిస్ అవుతున్నాని తెగ ఫీలవుతూ ఉంటుంది.

తాజాగా తను రూంకి వచ్చి ఐదేళ్లు నిండాయని ఎమోషనల్ అయింది. ‘ఈ ఇంటికి వచ్చి ఐదేళ్లు అవుతున్నాయి. ఎన్నో ఇచ్చినందుకు.. ఇంకెంతో నేర్చుకునేందుకు, ఎదిగేందుకు ఎన్నింటినో దూరం చేసిన దేవుడికి కృతజ్ఞతలు. ఈ ఇంటినే కాకుండా ఎన్నో మెమోరీస్‌ను నాతో పాటు షేర్ చేసుకున్నందుకు వైశాలి, రోహన్, మహిలకు ఎంతో థ్యాంక్స్..ఈ ఇంటిని నేను ఎంతో ప్రేమిస్తున్నాన..ఇలాంటి ఇంటి ఓనర్‌ను నేను ఇంత వరకు చూడలేదు’ అంటూ తేజస్వీ అదిరిపోయే ఫోటోను షేర్ చేసింది.