మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఆ ఇద్దరి స్నేహానికి కారణం జక్కన్న అనే విషయం తెలిసింది కేవలం సన్నిహితులకు మాత్రమే. జక్కన్న లేకపోతే తారక్-చరణ్ కలిసి సినిమా చేసేవారా? అన్న సందేహం చాలా మందిలో ఉంది. ఆర్.ఆర్.ఆర్ మల్టీస్టారర్ తెరపైకి రావడంతో దానిపై అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇద్దరు క్రేజీ స్టార్లతో మల్టీస్టారర్ అన్నది కేవలం దర్శకధీర వల్లే సాధ్యమైందని అంతా బలంగా చెప్పే మాట. కానీ తారక్ తనకు ముందు నుంచి మంచి స్నేహితులేనని ఆ విషయాన్ని చరణ్ ఓ ఇంటర్వూలో వెల్లడించాడు.
అయితే వాళ్లిద్దరి మధ్యలోకి జక్కన్న ఎంటర్ అయిన తర్వాత ఆ స్నేహం మరింత బలపడిందని తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా రెగ్యులర్ గా కొన్ని గంటలపాటు కలిసి ఉండటంతో ఆ బాండింగ్ ఇంకా స్ర్టాంగ్ అవుతోంది. తాజాగా ఆర్ ఆర్ ఆర్ సెట్ లో తారక్ తో అనుభూతిని చరణ్ పంచుకున్నాడు. తారక్ తో కలిసి నటిచడం ఎంతో సంతోషంగా ఉంది. ఉత్తరాంధ్రకు అల్లూరి సీతారామరాజు ఏం చేసారా? తెలంగాణ లో కొమరం భీమ్ అదే విధంగా స్వాతంత్ర్యం కోసం పోరాడారు. అలాంటి ఇద్దరి గొప్ప చరిత్రకారుల పాత్రలను తాము పోషించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తారక్ రోల్ ఫైర్ క్రాకర్ లా ఉంటుంది. అతని ఎనర్జీ అసాధారణం. సెట్ లో ఉంటే అంతా సరదానే. ఒకవేళ సెట్ లో లేకపోతే నాకేమి తోచదు. సెట్ లో సరదా వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. ఈ సినిమా ఒప్పుకోవడానికి ముందు నుంచే మంచి స్నేహితులం. మాబాండింగ్ ని మరింత స్ర్టాంగ్ చేసింది ఆర్ ఆర్ ఆర్. ఈ ప్రయాణం గొప్పగా ఉందని చరణ్ తెలిపాడు. అలాగే బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ తో కలిసి నటించడం గురించి చరణ్ రివీల్ చేసాడు. ఇప్పటివరకూ మా ఇద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు చిత్రీకరించలేదు. త్వరలోనే షూట్ జరుగుతుంనది తెలిపాడు. అయితే ఇప్పటికే ఆ రెండు పాత్రల మధ్య షూటింగ్ పూర్తయినట్లు వచ్చిన వార్తలను చరణ్ ఖండించారు.