సూర్య కేక పెట్టించాడు : ‘బందోబ‌స్త్’ తెలుగు టీజర్

త‌మిళ స్టార్ హీరో సూర్య‌, మ‌ల‌యాళ స్టార్ మోహ‌న్ లాల్‌, ప్ర‌ముఖ హీరో ఆర్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కేవీ ఆనంద్ తెర‌కెక్కిస్తున్న చిత్రం క‌ప్పాన్. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘కప్పాన్‌’ మూవీ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ ప్ర‌ధానమంత్రి పాత్ర పోషిస్తుండ‌గా, సూర్య ఆయ‌న‌కి బాడీ గార్డ్ గా ఉంటాడ‌ట‌.

స్టూడియో గ్రీన్‌ పతాకంపై అల్లిరాజా సుభాష్‌కరణ్‌, కేఈ జ్ఞానవేల్‌ రాజాలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హ‌రీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. సాయేషా సైగ‌ల్.. సూర్య స‌ర‌స‌న న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

దేశ‌భక్తి నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘బందోబ‌స్త్’ అనే టైటిల్‌తో ఈ చిత్రం తెలుగులో విడుద‌ల కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ తాజాగా విడుదలైంది. రానా చేతుల మీదుగా విడుదలైన ఈ టీజర్‌ ఇంట్రస్టింగ్ గా ఉంది.

Bandobast - Official Teaser | Suriya, Mohan Lal, Arya | K V Anand | Harris Jayaraj | Subaskaran

‘మీరు రెచ్చగొట్టింది నిద్రపోతున్న పులిని.. పంజా విసరడానికి ఎంతో సమయం పట్టదు’ లాంటి డైలాగ్‌లు ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి. ఆర్య, సాయేషా, బొమన్‌ ఇరానీ ముఖ్య పాత్రల్లో నటించగా.. కేవీ ఆనంద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు హారీస్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందించారు. ఈ మూవీ ఆగస్ట్‌లో విడుదల కానుంది.