తమిళ వర్దమాన నటి ఆత్మహత్య

తమిళ వర్దమాన నటి ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడింది. చైన్నైలోని వలసరవక్కంలో తన నివాసంలో ఈ రోజు ఆమె ఆత్మహత్య చేసుకుంది. ప్రియాంకకు మూడు సంవత్సరాల క్రితమే వివాహమైంది. ఇంకా పిల్లలు కలుగకపోవటంతో ఇంట్లో మనస్పర్ధలు వస్తున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. గత కొద్ది కాలంగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని ఆ  వేదనలోనే ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ప్రముఖ నటి రమ్యకృష్ణ చేస్తున్న వంశం తమిళ టివి సీరియల్ లో ప్రియాంక జ్యోతిక పాత్రలో నటిస్తున్నారు. ప్రియాంక పలు చిత్రాలతో పాటు, సీరియళ్ళలో నటించారు. బుల్లితెర నటిగా ఆమె ప్రేక్షకుల మనసు దోచుకుంది. తెలుగులో కూడా ఆమె పలు సీరియళ్లలో నటించారు. ఆమె మృతిపట్ల తమిళ, తెలుగు సిని వర్గాలు సంతాపం తెలిపాయి.