తమన్నాను ఈ గెటప్ లో అసలు గుర్తు పట్టలేం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ దర్శకుడు సురేందర్‌ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను… రామ్‌ చరణ్‌ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చ సుదీప్, జ‌గ‌ప‌తి బాబు, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా వంటి ప్ర‌ముఖ న‌టులు క‌నివిందు చేయనున్నారు. ఈ నేఫద్యంలో ఇప్ప‌టికే ఈ సినిమాలో న‌టిస్తున్న‌ ప‌లువురు న‌టుల ఫ‌స్ట్‌లుక్‌ల‌ను చిత్ర‌ యూనిట్ విడుద‌ల చేసింది. తాజాగా ఈ సినిమాలో ల‌క్ష్మి పాత్ర‌లో న‌టిస్తున్న త‌మ‌న్నా ఫ‌స్ట్‌లుక్‌ను కూడా చిత్ర‌యూనిట్ రివీల్ చేసింది.

ఇక ఈ సినిమాలో సౌత్‌ టాప్‌ స్టార్‌ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. తమన్నా మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు (శుక్రవారం) తమన్నా పుట్టిన రోజు సందర్భంగా సైరా టీం ఫస్ట్ లుక్‌ పోస్టర్‌తో మిల్కీ బ్యూటీకి బర్త్‌డే విషెస్‌ తెలియజేసింది. సినిమాలో ఆమె పాత్ర పేరును లక్ష్మిగా పరిచయం చేసిన సైరా టీం విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.