త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్‌

                                                                      (ధ్యాన్

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. హీరోయిన్‌గానే కాదు.. అడ‌పా ద‌డ‌పా స్పెష‌ల్ సాంగ్స్‌లో ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో అల్లుడు శీను, జై ల‌వ‌కుశ చిత్రంలో స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌టించిన త‌మ‌న్నా క‌న్న‌డ‌, తెలుగులో రూపొందిన `జాగ్వార్ చిత్రంలో కూడా త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్‌లో క‌న‌ప‌డింది. తాజాగా మ‌రో కన్న‌డ చిత్రంలో త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్ చేయ‌నుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. క‌న్న‌డంలో రూపొందుతున్న కె.జి.ఎఫ్ చిత్రంలో త‌మ‌న్నా స్పెష‌ల్ నెంబ‌ర్ చేయ‌నుంది. య‌ష్‌, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం తంగం అనే మాఫియా డాన్‌కు సంబంధించిన క‌థ‌తో పీరియాడిక్ మూవీగా తెర‌కెక్కుతోంది. ర‌మ్య‌కృష్ణ‌, నాజ‌ర్ ఇందులో కీల‌క పాత్ర‌ధారులు.