(ధ్యాన్)
సరైన సమయంలో తీసుకునే సరైన నిర్ణయం మనల్ని అందలాలను చేరుస్తుంది. కొన్ని సార్లు అవకాశాలు మళ్లీ మళ్ల మనల్ని వెదుక్కుంటూ వస్తుంటాయి. అయినా ఎందుకో వాటిని అందుకోలేకపోతాం. కానీ తర్వాత ఎంత బాధపడ్డా ఫలితం శూన్యం. శూన్యమని తెలిసినా బాధపడటం మానవ సహజం అని అంటోంది తమన్నా. వికీపీడియాలో తమన్నా చేస్తున్న సినిమాల లిస్టు చాలా పెద్దగానే కనిపిస్తోంది. అయితే వాటిలో కొన్ని ఇప్పుడు చేస్తున్నవి కాగా, కొన్ని ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ వాయిదాల కారణంగా ఉన్నవి. మరోవైపు కన్నడలోనూ ఓ ఐటమ్ సాంగ్‌లో చేసింది తమన్నా. కన్నడలో ఐటమ్ సాంగ్ చేయడం కూడా ఆమెకు ఇదేమీ కొత్తకాదు. కాకపోతే ఈ ఐటమ్ సాంగ్ ద్వారా మరోసారి తెలుగు, తమిళ ప్రేక్షకులను కూడా పలకరించబోతున్నానని గర్వంగా చెబుతోంది. ఇదంతా బాగానే ఉంది.. తమన్నా మనోవేదనకి కారణం ఏంటని అడుగుతున్నారా..? అక్కడికే వస్తున్నా. తమన్నాకి తీరని మనోవేదన కలిగించిన అంశం ఏమిటంటే మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా అట. ఆ సినిమాలో కాజల్ పాత్రకు ముందు తమన్నాని సంప్రదించారట. కానీ ఆ సినిమాను ఎందుకు వదులుకుందో ఇప్పటికీ తమన్నాకి కారణం తెలియట్లేదట. ఎంత ఆలోచించినా గుర్తుకూడా రాదట. `చలిచలిగా అల్లింది…` పాట విన్న ప్రతిసారీ ఆ సినిమా మిస్ అయిన సంగతి గుర్తుకొచ్చి చాలా బాధగా ఉంటుందట. కెరీర్ మొత్తం మీద అంత మిస్ చేసుకున్నందుకు బాధపడుతున్నది ఒక్క ఈ సినిమాలోనేననీ చెప్పుకొచ్చింది తమన్నా.