త్రివిక్రమ్ సరికొత్త స్ట్రాటజీ..సీన్ లోకి టబు

డైరక్టర్స్ అంటే ఒకప్పుడు కథ, నటీనటులు ఎంపిక, లొకేషన్స్ వంటివి షూటింగ్ కు ముందు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. మారుతున్న పరిస్దితుల్లో తమ సినిమాకు మార్కెట్ యాస్పెక్ట్ ప్రకారం బిజినెస్ జరిగే విధానాలను కూడా దర్శకుడు ప్లాన్ చెయ్యాల్సి వస్తోంది. తమ సినిమాలో ఏ ఆర్టిస్ట్ లను తీసుకుంటే ఏ ప్రాంతంలో ఎంత బిజినెస్ జరుగుతుందనే విషయాలు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరో సినిమాలకు ఇదో పెద్ద వ్యూహంగా మారింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం అదే ఫాలో అవుతున్నారని తెలస్తోంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తున్నాడు. అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం తమిళనటుడు సత్యరాజ్ .. మలయాళ నటుడు జయరామ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, సీనియర్ నరేశ్ లను తీసుకున్నారు.

అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ తల్లి పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందట. అందువలన ఈ పాత్రకి సీనియర్ హీరోయిన్ ను తీసుకుందామనే ఉద్దేశంతో, ‘టబు’ను సంప్రదిస్తున్నారట. ఆమె ఎంపిక దాదాపు ఖరారు కావొచ్చని అంటున్నారు. నదియా .. ఖుష్బూలాంటి వారిని తీసుకొచ్చిన త్రివిక్రమ్, ఇప్పుడు ‘టబు’ను రంగంలోకి దింపుతున్నారన్నమాట.

ఇక ఎంపిక లో త్రివిక్రమ్ ఓ డిఫరెంట్ బిజినెస్ స్ట్రాటజీనీ ఫాలో అవుతున్నాడంటున్నారు. సత్యరాజ్ ని తీసుకోవటం ద్వారా తమిళ మార్కెట్ ని, జయరామ్ ని తీసుకోవటంతో మళయాళ మార్కెట్ ని, టబుతో హిందీ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారట.

యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే , ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసే ప్లానింగ్ లో ఉన్నారు.