సైరా షెడ్యూల్ ఖ‌ర్చు తెలిస్తే షాకే!

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియ‌స్‌గా రూపొందిస్తున్న 151వ చిత్రం `సైరా న‌ర‌సింహా రెడ్డి`. సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్న చిత్ర‌మిది. దాదాపు రెండు వంద‌ల కోట్ల రూపాయ‌ల ప్రాజెక్ట్ ఇది. తెలుగు, త‌మిళం, హిందీ  భాష‌ల్లో భారీ రేంజ్‌లో సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు. సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. అందులో బాగంగా సినిమా జార్జియాలో షెడ్యూల్ ప్లాన్ చేశారు. సినీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ షెడ్యూల్ ఖ‌ర్చు తెలిసి షాక‌య్యాం. ఎందుకంటే ఓ భారీ బ‌డ్జెట్ సినిమాకు పెట్టే ఖ‌ర్చును కేవ‌లం ఓ షెడ్యూల్‌కే పెడుతున్నార‌ట‌. ఇంత‌కు ఆ బ‌డ్జెట్ ఎంతో తెలుసా.. అక్ష‌రాలా 50 కోట్ల రూపాయ‌లు. ఇండియా నుండి 200 మంది ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్‌ను జార్జియా తీసుకెళుతున్నార‌ట‌. ఏదేమైనా తండ్రి కోసం చ‌ర‌ణ్ ఖ‌ర్చుకు వెన‌కాడ‌టం లేదు. అమితాబ్ బ‌చ్చ‌న్‌, న‌యన‌తార‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చా సుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.