జార్జియా లో చిరంజీవి “సైరా “అంటూ శంఖారావం

ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ను చిరంజీవి “సైరా నరసింహారెడ్డి ” పేరుతో సినిమాగా రూపొందిస్తున్నారు . ఈ సినిమాలోని నరసింహ రెడ్డి బ్రిటిష్ వారితో చేసే యుద్ధ సన్నివేశాలను జార్జియా దేశం లో చిత్రీకరిస్తున్నారు . ఇప్పటికే దర్శకుడు సురేంద్ర రెడ్డి తో పాటు యూనిట్ అంతా వారం రోజుల క్రితమే వెళ్ళింది . చిరంజీవి కూడా రెండు రోజుల క్రితమే బయలుదేరి వెళ్ళాడు . ముందు రష్యా వెళ్లి అక్కడ తన కుమారుడు రామ్ చరణ్ ను కలుస్తాడు  . రామ్ చరణ్ తాజా సినిమా షూటింగ్ రష్యాలో  జరుగుతుంది . అక్కడ నుంచి చిరంజీవి జార్జియా వెడతాడని ఆయన సన్నిహితులు తెలిపారు .

జార్జియా దేశంలోనే సైరా నరసింహారెడ్డి షూటింగ్ ఎందుకు చేస్తున్నారంటే ..? ఈ దేశానికి ఎన్నో ప్రత్యేకతలు వున్నాయి . ఇది పశ్చిమాసియా  తూర్పు యూరప్ మధ్యలో వుంది . ఈ దేశానికి ఉత్తరాన రష్యా , దక్షిణాన టర్కీ దేశాలు వున్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది నల్ల  సముద్రం . జార్జియాకు పడమర వైపు వుంది . ఇక రాజధాని టీబిలిసి . ప్రాచీన కట్టడాలతో పాటు ఆధునిక నాగరికతను కూడా సంతరించుకుంది . నగరం మధ్య నుంచి నది పారుతూ ఉంటుంది . ఈ దేశంలో అద్భుతమైన లొకేషన్స్ ఎన్నో వున్నాయి. అందుకే దర్శకుడు సురేంద్ర రెడ్డి తో పాటు  నిర్మాత రామ్ చరణ్  స్వయంగా చూసి ఎంపిక చేసుకున్నారు . సైరా నరసింహా రెడ్డిలో యుద్ధ సన్నివేశాలకు ఎంతో ప్రధానాయత ఉంది . వ్యయ ప్రయాసలకు
ఓర్చి ఇక్కడ  షూటింగ్ చేస్తున్నారు.

రేపటి నుంచి చిరంజీవి ఈ యుద్ధ సన్నివేశాల్లో పాలగోనే అవకాశం ఉందని తెలుస్తుంది. చిరంజీవికి జంటగా నాయన తార నటిస్తున్నది . అమితాబ్ బచ్చన్, జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు . రామ్ చరణ్ తన షూటింగ్ పూర్తి కాగానే జార్జియా వెళ్లే అవకాశం వుంది