సిల్వర్ స్ర్కీన్ పై రెచ్చిపోనున్న స్వాతి నాయుడు

స్వాతి నాయుడు ఎన్నో అడల్ట్, హాట్, రొమాంటిక్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించి యూత్ ను ఓ ఊపు ఊపేసింది. బుల్లితెర మీద యూట్యూబ్ చిత్రాల్లో జోరుగా నటించినా సిల్వర్ స్క్రీన్ మీద ఆమెకు అవకాశాలు దక్కలేదు. సినిమా అవకాశాల కోసం చాలా ప్రయ్నత్నించినా ఆమె కోరిక మాత్రం నెరవేరలేదు. కానీ ఆశలు వదులుకోకుండా ప్రయత్నిస్తూనే ఉంది.

ఎట్టకేలకు స్వాతి నాయుడు ఆశ నెరవేరింది. ఓ టాలీవుడ్ కొత్త నిర్మాత ‘ఆమె కోరిక’ అనే టైటిల్ తో స్వాతి నాయుడును లీడ్ రోల్ లో పెట్టి సినిమా తీసాడు. ఈ తాజా సినిమాలోని స్వాతి నాయుడు సీన్లు -ఫోటోలు యూత్ కు కాకపుట్టిస్తున్నాయి. అంతే కాదు సినిమా యూనిట్ స్వాతి నాయుడు కి ఓ బిరుదు కూడా ఇచ్చేశారు. ‘యూట్యూబ్ స్పైసీ స్థార్’ అంటూ గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద నటించాలన్న స్వాతి నాయుడు కోరిక ఈ సినిమా ద్వారా నెరవేరబోతోంది. ఈ హాట్ భామ మున్ముందు మరిన్ని అవకాశాలు దక్కించుకుంటుందో? లేదో చూడాలి మరి.