‘వినయ విధేయ రామ’ ప్లాఫ్ కు కారణం చరణ్ మాటల్లో….

‘రంగస్థలం’ సూపర్‌ డూపర్‌ హిట్‌ తర్వాత రామ్‌చరణ్ నటించిన తాజా చిత్రం ‘వినయ విధేయ రామ’. మాస్ డైరెక్టర్ గా పేరున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటు ఫ్యాన్స్‌లో.. అటు ట్రేడ్‌లో భారీ అంచనాల మధ్య రిలీజైంది.

మెగాభిమానులకు సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాతో రామ్‌చరణ్‌కు బోయపటి శ్రీను సక్సెస్ ఇవ్వలేకపోయారు. అంతేకాదు.. ఈ సినిమాలో కొన్ని సీన్లు సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ అయ్యే పరిస్దితి ఏర్పడింది. కేవలం యాక్షన్ సన్నివేశాల కోసమే ఈ సినిమాను తెరకెక్కించినట్టు… జనాలకు అర్ద అయ్యింది.

మరీ ముఖ్యంగా విల‌న్ చేతిలో చిక్కుకున్న అన్నయ్య (ప్రశాంత్‌) ఫోన్ చేస్తే ఎయిర్ పోర్ట్ అద్దాన్ని బద్దలుగొట్టుకుని రామ్‌చ‌ర‌ణ్ ప‌రుగున.. ఓ బ్రిడ్జి మీద నుంచి రైలు మీద‌కు దూకేసి విశాఖ నుంచి నేపాల్ బోర్డర్‌కు వెళ్లటం వంటివి నవ్వులు పాలయ్యాయి. ఈ సీన్ విపరీతంగా ట్రోల్‌ అయ్యింది. అది గమనించిన చిత్రం టీమ్ .. కలెక్షన్లపై వీటి ప్రభావం ఉందనుకుందో ఏమోగానీ.. ఈ సన్నివేశాన్ని తొలగించింది.

అయితే ఈ సినిమా విషయమై ఎందుకు రామ్ చరణ్ అలాంటి సీన్స్ చేసారు అన్నది అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే నిన్న సంక్రాంతి సందర్బంగా ఈ చిత్రం ప్రమోషన్ కోసం ఓ టీవి ఛానెల్ ఇచ్చిన రామ్ చరణ్ ఇంటర్వూలో మనకు ఆ సమాధానం దొరుకుతుంది.

షాకింగ్ : ‘వినయ విధేయ రామ’ రెండు రోజుల కలెక్షన్స్ !

ఆ ఇంటర్వూలో రామ్ చరణ్ క్లియర్ గా తాను..ఈ సినిమా పూర్తిగా డైరక్టర్ విజన్ అని నమ్మి, ఎదురు ప్రశ్నలు వేయకుండా , ఏ సీన్ లోనూ, డైలాగులోనూ ఇన్వాల్వ్ కాకుండా చేసారు. డైరక్టర్ బోయపాటి శ్రీను కు పూర్తిగా సరెండర్ అయ్యారు. ఎక్కడా తన బ్రెయిన్ ని వాడలేదంటూ క్రెడిట్ మొత్తం డైరక్టర్ కే ఇచ్చారు.

అయితే ఇక్కడ అర్దం చేసుకోవాల్సిన విషయం ఏమిటీ అంటే …ఈ ఇంటర్వూ…సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్ కోసం షూట్ చేసింది. అంటే అప్పటికి రామ్ చరణ్ కు ఈ సినిమా రిజల్ట్ తెలియదు.