పెళ్లి కాకుండా తల్లి.. సురేఖ వాణి కూతురు ఘనకార్యంపై నెటిజన్స్ ఫైర్!!

Surekha Vani Supritha

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ డ్యాన్సులు చేస్తూ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంటారు. ఆ మధ్య ఇంట్లో ప్రైవేట్‌గా కాలా చష్మా అంటూ బుల్లి నిక్కర్లు వేసుకుని స్టెప్పులేసిన వీడియో దుమారం లేపిన సంగతి తెలిసిందే. ఇక టిక్ టాక్ వచ్చాక ఈ తల్లీ కూతుళ్లకు హద్దే లేకుండా పోయింది. రోజుకో రకమైన కొత్త కొత్త గెటప్‌లు వేసి వెరైటీ స్టెప్పులతో అదరగొట్టేవారు.

తల్లీ కూతుళిద్దరూ విదేశాల్లో జాలీగా తిరుగుతుంటారు కూడా. ఈ మధ్య సోషల్ మీడియాలోనూ ఓ ప్రచారం జరుగుతోంది. తన కూతురు సుప్రితను సినిమాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని, అందుకే ఇంతలా హల్చల్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదంతా ఏమో గానీ తాజాగా వీరిద్దరు చేసిన పని మాత్రం నిజంగానే ఆశ్చర్యకంగా మారింది. వీరు చేసిన పనిపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Surekha Vani Supritha Celebrate Pet's Birthday
Surekha Vani Supritha Celebrate Pet’s Birthday

మనుషుల్లో జంతు ప్రేమికులుండటం సర్వ సాధారణమే. ఇక సెలెబ్రిటీల విషయంలో అయితే అది మరీ హద్దులు దాటుతుంది కూడా. సరిగ్గా ఇదే విషయంలో సురేఖా వాణి, సుప్రితల విషయంలో జరిగింది. వీరు చేసిన ఓ పోస్ట్‌పై ప్రస్తుతం నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. వీరి పెంపుడు కుక్క క్రిష్‌కు బర్త్ డే సెలెబ్రేషన్స్ చేశారు. కేక్ కటింగ్ కూడా చేయించారు. ‘హ్యాపీ బర్త్ డే క్రిష్.. నువ్ మా జీవితాల్లోకి వచ్చాకే ఆనందంగా మారింది. సుప్రిత నువ్ నాకెంతో ప్రత్యేకంగా.. లవ్యూ చిన్నితల్లి’ అంటూ పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్, ఆ బర్త్ డే వేడుకలపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మీ ఇద్దరికి బాగా పిచ్చి ముదిరిందని కామెంట్స్ చేస్తున్నారు. పైగా ఆ పెంపుడు కుక్క తన కొడుకు అని ప్రొఫైల్‌లో పెట్టుకోవడం, ఆ కుక్కకు సపరేట్ పేజ్‌ను క్రియేట్ చేయడం సుప్రితకే చెల్లింది.