మెగాఇంట్లో సంక్రాంతి వేడుకల ఎంత ఘనంగా జరుగుతాయో అందరికీ తెలిసిందే. భోగీ సంక్రాంతి కనుమ ఇలా మూడు రోజులు మెగా అల్లు ఫ్యామిలీలందరూ ఒకే చోట ఉంటారు. భోగీ మంటలు పెట్టి అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. పాటలు, డ్యాన్సులు, ముచ్చట్లు పెట్టుకుంటూ రచ్చ చేస్తారు. ఇక ప్రతీసారిలాగే అక్కడే మెగా ఫ్యామిలీ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేస్తుంది. చిరు దోశలు వేస్తుంటాడు.. అందరూ ఆరగిస్తుంటారు.
చిరంజీవి దోశలు వేయడంలో ఎంత పాపులర్ కలవాడో అందరికీ తెలిసిందే. చిరు దోశ కొన్ని హోటల్స్‌లోని మెనూలో కూడా ఉంటుంది. అలా మొత్తంగా చిరు దోశలు బాగానే ఫేమస్. మొన్నీ మధ్య చిరు కళ్లకు గంతలు కట్టేసుకుని మరి దోశను ఫ్లిప్ చేసేశాడు. అది చూసి అందరూ షాక్ అయ్యారు. మొత్తంగా చిరు దోశలు వేసి అందరికీ కడుపునిండా పెట్టినట్టే ఉన్నాడు. అయితే ఆతరువాత మెగా కోడలుకూడా రంగంలోకి దిగినట్టుంది.
అయితే మెగా కోడలు ఉపాసన దోశలు వేస్తుంటే.. అత్తగారు బానే సాయం చేసినట్టున్నారు. పెనం మీద దోశ ఉపాసన వేస్తే.. దాని మీద ఆయిల్ రాస్తూ అత్త సాయం చేసింది. ఈ తతంగాన్ని మొత్తం నిహారిక కెమెరాలో బంధించింది. ఈ చిన్న పాటి వీడియోను ఉపాసన తన స్టైల్లో పోస్ట్ చేసింది. స్టెప్ 1 స్టెప్ 2 అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి వంటల ప్రోగ్రాంలా మారిపోయిందన్నట్టుగా చెప్పేసింది. ఇలా సంక్రాంతి సంబరాలు మెగా ఇంట్లో గ్రాండ్‌గానే జరిగాయన్నమాట.