సోషల్ మీడియా వచ్చాక ప్రతీది చర్చగానే మారిపోతోంది. ఎదుటివాళ్ల పర్శనల్ లైఫ్ లోకి వెళ్లి కామెంట్స్ చేయటం దాకా చర్చలు సాగుతున్నాయి. ఇప్పుడు అలాంటిదే…సుకుమార్ భార్య ..లాండ్రీ బిజినెస్ లో ప్రవేశించింది అనే వార్తకు సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్. స్టార్ డైరక్టర్ భార్య ..లాండ్రీ బిజినెస్ చేయటం ఏమిటి అని కొందరు వీరాభిమానులం అని చెప్పుకుంటూ క్వచ్చిన్ చేస్తున్నారు.
రీసెంట్ గా స్టార్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత తన ఇనిస్ట్రగ్రమ్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. అది మీడియాలోకి క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. అదేమిటంటే… తబిత… మరో ముగ్గురు పార్టనర్లతో కలిసి ‘లాండ్రీకార్ట్'(Laundrykart) అనే సంస్థను స్థాపించారు.
ప్రీమియం సూట్స్ , ఖరీదైన చీరలు వాషింగ్ కు సంబంధించిన ఈ లాండ్రీ మార్ట్ ఒక ప్రముఖ సంస్థ కు చెందిన ప్రాంఛైజ్ అది. ఇప్పటికే హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ.. మియాపూర్.. లాంకో హిల్స్ లాంటి ఏరియాలలో ఆఫీసులు కూడా ఓపెన్ చేసారు.
మొదట్లోనే ఇలా హైదరాబాద్ లో ఏకంగా మూడు చోట్ల బ్రాంచ్ లు పెడుతూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది. ఈ సంస్ద ఖరీదైన దుస్తులను ఉతకడం.. ఇస్త్రీ చేయడం.. డ్రై క్లీనింగ్ చేయడం లాంటి సర్వీసులను అందిస్తుంది. ఈ సేవలను ఒక యాప్ ద్వారా పొందే అవకాశం ఉంది.
ఇదంతా చదివిన వాళ్లు తీరిగ్గా సోషల్ మీడియాలో చర్చ మొదలెట్టారు. సుకుమార్ భార్య ఇలా చేయటం ఏమిటి అని వారి వాదన. సరిపోయింది. బిజినెస్ అన్నాక..ఏదైనా ఒకటే కదా..కామెంట్స్ చేసేవారు మరీ బుర్రతక్కువతనం బయిటపెట్టుకోవటం కాకపోతే..ఏమంటారు.