(ధ్యాన్)
ఎవరు ఎలాంటి పని చేయాలన్నా ముందు కుటుంబం సపోర్ట్ తప్పనిసరి. అందరికీ కుటుంబం సపోర్ట్ దొరుకుతుందా? అంటే ఏమో కచ్చితంగా చెప్పలేం. సమంతకు రియల్ లైఫ్‌లో పుట్టింటి నుంచి బోలెడంత సపోర్ట్ ఉంది. కానీ ఆమె వెండితెర సోదరుడు మాత్రం ఆమెతో క్లాష్ కి సిద్ధపడుతున్నాడు. ఎవరా వెండితెర బ్రదర్? ఏంటా కథ అని అనుకుంటున్నారా? సమంత తెలుగులో నటించిన తొలి సినిమా `ఏ మాయ చేశావె`. ఈ సినిమాలో ఆమె సోదరుడిగా సుధీర్‌బాబు నటించాడు. ఆయన నిర్మాతగా మారి నటించిన `నన్ను దోచుకుందువటే` సినిమా సెప్టెంబర్ 13న విడుదల కానుంది. అదే రరోజు సమంత అక్కినేని నటించిన `యు టర్న్` కూడా విడుదల కానుంది. `ఏమాయ చేసావె`లో జెస్సీగా సమంత, జెర్రీగా సుధీర్‌బాబు నటంచారు. ఈ సినిమా తర్వాత వారిద్దరు ఇంకే సినిమాలోనూ కలిసి కనిపించలేదు. తాజాగా ఒకే రిలీజ్ డేట్‌కి వస్తున్నారు. ఈ విషయాన్ని సుధీర్ ట్విట్టర్‌లో ప్రస్తావించారు. తన సోదరిని పొగడ్తలతో ముంచెత్తారు. అందుకు సమంత సోదరుడికి కృతజ్ఞతలు కూడా చెప్పారు. అదన్నమాట సమంత సిల్వర్‌స్క్రీన్ పుట్టింటి క్లాష్.
యు టర్న్ కి సంబంధించి సమంత పెద్ద హిట్ కొట్టాలని, సరిహద్దులను చెరిపేసి ముందుకు సాగుతున్న తన శ్రీమతి గొప్ప గొప్ప స్థానాలకు చేరుకోవాలని నాగచైతన్య కూడా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.