పోలీస్ పాత్రలో చేస్తున్న సుధీర్ బాబు !

దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మల్టీ స్టారర్ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
మల్టీస్టారర్ గా సీనియర్‌ హీరో నాగార్జునతో కలిసి దేవదాస్‌ సినిమాలో నటించిన నాని, ప్రస్తుతం సుధీర్‌ బాబుతో కలిసి మరో సినిమా చేస్తున్నాడు.

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వి అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చారు సుధీర్‌ బాబు. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న సినిమాలో తాను పోలీస్‌ పాత్రలో నటిస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే పోలీస్‌ పాత్రలో కనిపించి సుధీర్‌ బాబు మరోసారి అదే లుక్‌లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదే సమయంలో ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌లోనూ నటిస్తున్నట్టుగా తెలిపారు.