‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్ టీజ‌ర్

పవన్ కళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రం అత్తారింటికి దారేది. ఫన్, సెంటిమెంట్‌, ఎమోష‌న్స్‌తో కూడిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని త‌మిళంలో రీమేక్ అవుతోంది. తమిళ స్టార్ డైరెక్ట‌ర్ సుంద‌ర్‌.సి ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ రీమేక్ తెర‌కెక్కుతుండ‌గా, ప‌వ‌న్ తెలుగులో చేసిన పాత్ర‌ని శింబు చేస్తున్నాడు . తెలుగు లో నదియా పోషించిన ‘సునంద’(అత్త) పాత్రని తమిళంలో ర‌మ్య‌కృష్ణ పోషిస్తున్నారు.

సూపర్ హిట్ చిత్రం రీమేక్ కావటం, తొలిసారి సుంద‌ర్‌- శింబు జ‌త‌క‌ట్ట‌డంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. వంత రాజ‌వ‌థాన్ వ‌రువెన్ అనే టైటిల్‌లో వస్తున్న ఈ చిత్రం టీజర్ రిలీజై మంమచి క్రేజ్ తెచ్చుకుంది. ఇందులో స‌ీన్స్ చాలా భాగం తెలుగు వ‌ర్షెన్ మాదిరిగానే ఉన్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

Vantha Rajavathaan Varuven - Teaser | STR | Sundar C | Lyca Productions

ఈ చిత్రంలో శింబు స‌ర‌స‌న మేఘా ఆకాశ్‌, కేథ‌రిన్ థెస్రా హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ప్ర‌భు, నాజ‌ర్‌, యోగిబాబు, మోట్టా రాజేంద్ర‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. హిప్ హాప్ త‌మీజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ నిర్మిస్తుంది.