ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లకు ఒకే పోలిక. ఆ ఇద్దరూ ప్రేమించి పెళ్లాడారు. కెరీర్ పరంగా ఎప్పుడూ బిజీనే. ఇక భర్తలు కూడా భార్యల్ని మించిన బిజీ. దీంతో ఆ ఇద్దరికీ ఇప్పటికీ వ్యక్తిగత జీవితంలో ఆశించినవేవీ దక్కడం లేదన్న గుసగుస వినిపిస్తోంది. ఇందులో ఒకరు బాలీవుడ్ స్టార్ కాగా.. మరొకరు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.
ఇంతకీ ఏమైంది? అంటే.. ఆ ఇరువురూ క్రేజీ సెలబ్రిటీల్ని పెళ్లాడినా సహచర రంగంలో ఉన్న వారినే పెళ్లాడినా కానీ బిజీ లైఫ్ వల్ల ఎందుకనో ఇంకా కిడ్స్ కి జన్మనివ్వలేకపోయారు. ఇక దీనిపైనే ఇండ్లలోనూ పదే పదే ప్రశ్న ఎదురవుతోంది. మరోవైపు పదే పదే మీడియాలు గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తూ ఉంటే విసుగొచ్చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఆ క్రమంలోనే ఆ ఇద్దరూ కెరీర్ పరంగా బిజీని తగ్గించారు. ఇప్పటికీ కెరీర్ పరంగా డైలమాలోనే ఉన్నారు.
తాజా సమాచారం ప్రకారం.. సదరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇటీవల నటనను పూర్తిగా విరమించారట. నటనకు గుడ్ బాయ్ చెప్పేసి పూర్తి స్థాయి నిర్మాతగా కొనసాగనుందట. ఓవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్ లు నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. కనీసం నటనకు స్వస్థి చెబితే.. ఇకనైనా తనకు ఫ్యామిలీ లైఫ్ కి కావాల్సినంత సమయం దొరికే వీలుందని పిల్లల్ని కనేందుకు ఇబ్బంది ఉండదని భావిస్తోందట.
ఇక ఆ బాలీవుడ్ నటి స్ఫూర్తితోనే కెరీర్ జర్నీ సాగిస్తున్న టాలీవుడ్ హీరోయిన్ కూడా తననే ఫాలో చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆ హీరోయిన్ నిర్మాతగా టర్న్ అవుతోందన్న ప్రచారం ఫిలింనగర్ లో వినిపిస్తూనే ఉంది. తను కూడా భర్తకు.. ఫ్యామిలీ లైఫ్ కే టైమ్ కేటాయించాలని ఫిక్సయ్యి ఇలా టర్న్ అవుతోందని తాజాగా ఆ కాంపౌండ్ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పిల్లల్ని కనాలన్న ఒత్తిడి నుంచి బయటపడేందుకే ఈ నిర్ణయం అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికి పెండింగులో ఉన్నవన్నీ పూర్తి చేసి కాస్త తీరిక అయిపోయే ప్లాన్ లో ఉందట.