బాలీవుడ్ వెటరన్ హీరో గోవిందా కుమారుడు యశ్వర్ధన్ కార్ ప్రమాదానికి గురైంది. ముంబై జుహు వద్ద ప్రఖ్యాత నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలిమ్స్‌కు చెందిన కార్ అనూహ్యంగా యశ్వర్ధన్ కారును ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించిందని తెలిసింది. ప్రమాద సమయంలో యశ్ స్వయంగా కార్ ని నడుపుతున్నారని తెలిసింది. అయితే ఈ ప్రమాదంలో అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. యశ్వర్ధన్ చేతికి చిన్న గాయం అయిందని గోవిందా వెల్లడించారు.
అయితే ప్రమాద స్థలంలో ఇరువర్గాలు చర్చించుకుని సర్ధి చెప్పుకోవడంతో పోలీస్ కేసు ఏదీ నమోదు చేయలేదని తెలిసింది. యశ్ రాజ్ ఫిలింస్ డ్రైవర్ నేరుగా వెళ్లి యశ్ కి సారీ చెప్పడంతో అంతా సద్ధుమణిగిందట. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కు కూడా ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనా స్థలానికి వెళ్లిన గోవిందా ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడారని తెలుస్తోంది.