ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మ పిచ్చి పీక్స్ వేషాల గురించి తెలిసిందే. జీఎస్టీ అంటూ అప్పట్లో బోలెడంత హంగామా చేశాడు. గాడ్ సెక్స్ ట్రూత్! అంటూ యూత్ వెర్రెక్కిస్తూ.. ప్రచారం చేసుకుని యూట్యూబ్ లో బూతు సినిమాని అమ్ముకున్నాడని అప్పట్లో తీవ్ర విమర్శలొచ్చాయి. ఏదైతేనేం బిజినెస్ చేయడం ఇంపార్టెంట్! ఈ క్వాలిటీ ఆర్జీవీకే ఉందని ప్రూవైంది.
ఇకపోతే ఇప్పుడు కూడా అతడు అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడా? మరోసారి శృంగార తార మియా మల్కోవాతో శృంగార రసాస్వాధనలే ధ్యేయంగా యూత్ పై మంత్రం వేస్తున్నాడా? అంటే అవుననే మొన్న రిలీజైన మియా మల్కోవా `క్లైమక్స్` ట్రైలర్ రివీల్ చేసింది. త్వరలోనే దీనిని నెట్ ఫ్లిక్స్ లో లైవ్ చేయనున్నారు. డిజిటల్లో అద్భుతమైన వ్యూవర్ షిప్ సాధ్యమేనని అంచనా వేస్తున్నారు.
అంతేకాదు.. క్లైమాక్స్ కి ఆర్జీవీ ప్రచారం మామూలుగా లేదు. ఎప్పటికప్పుడు మియా మల్కోవా వేడెక్కించే భంగిమల్ని ట్విట్టర్ లో షేర్ చేస్తున్న ఆర్జీవీ.. మియాకి సీన్లు వివరిస్తున్న కెప్టెన్ ఫోటోల్ని రివీల్ చేశాడు. ఇవన్నీ ప్రస్తుతం యూత్ లో హాట్ టాపిగ్గా మారాయి. ఆర్జీవీ మరీ ఇంతగా భరితెగించాడేమిటి? ఇలా ఓ శృంగార తార భంగిమల్ని సేలబుల్ పాయింట్ గా ఎంచుకుని ఇలా చేస్తాడా? అంటూ సీరియస్ అవుతున్నారంతా. తన స్థాయిని తగ్గించుకుని మరీ ఇలా దిగజారుడు సినిమాలు తీస్తాడేమిటో! అంటూ పెదవి విరిచేస్తున్నారు. అమ్ముకోవడం అనేది ఒక కళ. ఈ కళలో రాటుదేలిపోయాడు ఆర్జీవీ అంటూ ఫాలోవర్స్ ప్రశంసించడం విశేషం.
https://twitter.com/RGVzoomin/status/1264010830053388289