ఆర్జీవీ ఏం చేసినా సంచలనమే. ఏ విజువల్ తీసినా అగ్గి రాజేయాలి. అదే కదా ఆయన ప్రత్యేకత. ఏదో ఒక వివాదం క్రియేట్ చేసి.. తన వెంట మీడియాని తిప్పుకుని ఉచిత ప్రచారం కొట్టేసే ఆర్జీవీ అప్పట్లో పాశ్చాత్య శృంగార తార మియా మల్కోవాతో జీఎస్‌టీ (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) అంటూ హిట్టు బొమ్మ తీశాడు. యూట్యూబ్ లో బంపర్ హిట్టయ్యింది ఈ చిత్రం. హిట్టవ్వడం మాట అటుంచితే వివాదాలతో ఆర్జీవీ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది.
మరోసారి అలాంటి ట్రీట్ నే ప్లాన్ చేశారు ఆర్జీవీ. తాజాగా క్లైమాక్స్ పేరుతో అతడు తెరకెక్కించిన మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. క్లైమాక్స్ టీజర్ ఇదివరకూ రిలీజై ఆకట్టుకుంది. లేటెస్టుగా ట్రైలర్ రిలీజైంది. ఆర్జీవీ మార్క్ యంగేజింగ్ ట్రైలర్ ఇది. ట్రైలర్ ఆద్యంతం అడల్ట్ స్టార్ మియా మల్కోవా అంగాంగ ప్రదర్శన మైమరిపించింది. ట్రైలర్ చూస్తుంటే థ్రిల్లర్ జోనర్ సినిమా ఇది. టీజర్ యూట్యూబ్‌లో వన్ మిలియన్ వ్యూస్‌ను కొన్ని గంటల్లోనే రాబట్టింది. మరి ట్రైలర్ ఏ స్థాయిలో దూసుకెళుతుందన్నది చూడాలి.
ఇక దీంతో పాటే ఆర్జీవీ తెరకెక్కించిన `ఎంటర్ ది గర్ల్ డ్రాగన్` రిలీజ్ కి రావాల్సి ఉంది. వేడెక్కించే అందాల ఆరబోత.. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో చిత్రమిది. ఈ సినిమాని ఆర్జీవీ ఏ ముహూర్తాన మొదలు పెట్టాడో కానీ.. చైనాలో రిలీజ్ చేయాలన్న కల నెరవేరక ముందే కరోనా(కొవిడ్ 19) వైరస్ ప్రపంచాన్ని చుట్టబెట్టేసింది. దురదృష్ఠవశాత్తూ చైనాలోనే (వూహాన్) జన్మించిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ సినీపరిశ్రమల్ని సర్వనాశనం చేసింది. సరిగ్గా ఇలాంటి టైమ్ లో మియా మల్కోవాతో ఓటీటీ సినిమా తీశాడు వర్మ.