ఓవైపు కరోనా వైరస్ లాక్ డౌన్ .. స్వీయ నిర్భంధం బోలెడన్ని పాఠాలు నేర్పిస్తుంటే స్టార్ కిడ్ జాన్వీ కపూర్ ఏం చేసిందో తెలుసా? ఈ స్వీయ నిర్భంధంలో పాపా బోనీకపూర్.. సోదరి ఖుషీ కపూర్ తో తన విలువైన సమయాన్ని గడిపింది. దాదపుగా 70 రోజుల క్వారంటైన్ లో ఆ ఇద్దరికీ అన్నీ తానే అయ్యి సాకిందట. అంతేకాదు.. బోనీ- ఖుషీ కపూర్ తనపై ఎంతగా డిపెండ్ అయిపోయారో కూడా చెప్పుకొచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆ ఇద్దరికీ నేను లేకపోతే ఇంకేమవుతుందో అంటూ ఆందోళనను వ్యక్తం చేసింది.
మరోవైపు ఫోటోషూట్లతోనూ తీరిక లేనంత బిజీ అయిపోయింది జాన్వీ. ఈ అమ్మడి ఇన్ స్టా పోస్టుల్ని పరిశీలిస్తే… వరుసగా రకరకాల ఫోటోలు వేడి పెంచుతాయి.
ఈరోజుల్లో నా డ్రీమ్ లుక్ చూస్తారా.. ది జార్జియస్ ఔట్ డోర్ షూట్ అంటూ ఓ ఫోటోని రివీల్ చేసింది. ఇందులో పసుపు వర్ణం డిజైనర్ డ్రెస్ లో తళుక్కుమంది జాన్వీ.
వేరొక ఫోటోలో జాన్వీ వెట్ లుక్ అభిమానుల కలల్లో కల్లోలాన్ని నింపింది. ఈ లుక్ లో జాన్వీ ఎంతో స్పయిసీగా కనిపిస్తోంది. అయితే ఇది ఓ వీడియో నుంచి ఎంపిక చేసిన ఫోటో అని అర్థమవుతోంది.
వేరొక ఫోటోలో తన గారాల పట్టీ ఖుషీ కపూర్ తో కలిసి ఫోజిచ్చింది. ఈ ఫోటోలో ఖుషీ నిజంగానే జాన్వీ చెప్పినట్టు అక్కపైనే డిపెండ్ అయ్యింది మరి.
జాన్వీ షేర్ చేసిన ఎవ్వర్ లేటెస్ట్ క్వారంటైన్ వీడియో. ఈ స్వీయ నిర్భంధ సమయంలో ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేసిందో .. ఎంత అల్లరిగా చిలిపిగా ఉంటుందో అర్థమవుతోంది ఈ వీడియో చూస్తుంటే… ఇక జాన్వీ కెరీర్ సంగతి చూస్తే తక్త్ సెట్స్ కెళ్లాల్సి ఉండగా.. పలు క్రేజీ చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉంది. కార్గిల్ గర్ల్ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు.