Home Tollywood క్రిస్మస్ పూట ..చిరు ఇంట ఆనందహేల

క్రిస్మస్ పూట ..చిరు ఇంట ఆనందహేల

క్రిస్మస్‌ రోజున మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ, కల్యాణ్‌దేవ్‌ దంపతులకు పండంటి ఆడ పిల్ల పుట్టింది. ఈ విషయాన్ని కల్యాణ్‌దేవ్‌ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

అంతేకాకుండా.. పాప కాలి ముద్ర ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. ‘2018 క్రిస్మస్‌ నా జీవితాంతం గుర్తుండి పోతుంది. మాకు ఇవాళ ఉదయం ఆడశిశువు పుట్టింది. మీ అందరికీ సూపర్‌ మెర్రీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు’ అని ఆయన పోస్ట్‌ చేశారు.

Chiru2 | Telugu Rajyam

కల్యాణ్‌దేవ్‌ ప్రస్తుతం తన రెండో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయన ‘విజేత’ చిత్రంతో ఈ ఏడాది నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు..కానీ కల్యాణ్‌ దేవ్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీని తర్వాత ఆయన పులి వాసు దర్శకత్వంలో నటిస్తున్నారు. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

Related Posts

‘ఆహా’ లో ఓహో అనిపిస్తోన్న రవితేజ క్రాక్ .. “25 కోట్ల నిమిషాల స్ట్రీమ్” !

సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో సంచలన విజయం సాధించింది రవితేజ నటించిన క్రాక్. రవితేజకు దాదాపు నాలుగేళ్ళ తర్వాత సిసలైన విజయం తీసుకొచ్చిన సినిమా ఇది. ఇక రవితేజ సైడ్ కారెక్టర్స్ వేసుకోవాల్సిందే అంటూ...

‘వీరమల్లు’ నుండి పవన్ కళ్యాణ్ ఫోటో లీక్ .. పిక్ వైరల్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో హిస్టారికల్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ అభిమానుల్లో లో హై ఓల్టేజ్ క్యూరియాసిటీని...

ఇంట్రెస్టింగ్ పాయింట్.. మొగలి రేకులు సాగర్ రచ్చ!

మొగలిరేకులు సీరియల్ చూడని, ఆ పేరు వినని తెలుగు ప్రేక్షకులు ఉండరు.బుల్లితెరపై మొగలిరేకులు ఓ సంచలనం. అందులోని అన్ని పాత్రలూ ఓ ముద్రను వేశాయి. మరీ ముఖ్యంగా ఆర్కే నాయుడి పాత్రలో సాగర్...

ఆ సినిమా చేయొద్దన్నా వినలేదు.. జేడీ చక్రవర్తి కామెంట్స్

జేడీ చక్రవర్తి సినిమాలు, ఆయన ఎంచుకునే పాత్రలు అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. ట్రెండ్‌ను ఫాలో అవ్వకుండా కొత్తగా ఏదైనా ట్రై చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. అలాంటి జేడీ చక్రవర్తి తాజాగా మీడియాతో ముచ్చటించాడు....

Latest News