డైరక్టర్ చేసిన పనికి హీరో సిగ్గుపడి అపాలజీ ట్వీట్స్

నారా రోహిత్, సుధీర్‌బాబు, శ్రీవిష్ణు, శ్రియ ప్రధాన పాత్రల్లో వచ్చిన రీసెంట్ చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’.ఆ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచటం జరిగింది. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే తె అక్టోబర్ 23న యూఎస్‌లో ఈ సినిమా ప్రీమియర్లు వేశారు. ఆ ప్రీమియర్ షోలు చూసిన జనం, మీడియా సినిమా అస్సలు బాగాలేదని తేల్చేసారు. దీంతో ఇక్కడ ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఇక్కడ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూ రైటర్స్ కూడా చాలా తక్కువ రేటింగ్‌లే ఇచ్చారు. ఇది డైరక్టర్ కు మండుకొచ్చింది. నేను ఇంతగొప్ప సినిమా తీస్తే మీకు అలా నోటి కొచ్చింది రాస్తారా..అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

వీరభోగ వసంతరాయలు సినిమాలో మీరు సీన్స్ వెతకలేరు. వాటిలో చాలావి లేయర్లే. ఆ లేయర్లను డీకోడ్ చేయడానికి మీలాంటి రివ్యూ రైటర్స్ కు మరో 2, 3 దశాబ్దాలు పడుతుంది. అలాంటిది ఒకే ఒక్కసారి సినిమా చూసి రేటింగ్ ఇవ్వొచ్చని మీరు ఎలా అనుకున్నారు? అంటూ సీరియస్ అయ్యారు. ఇది సహజంగానే మీడియాలో నెగిటివ్ ఇంపాక్ట్ కలగచేసింది. దర్శకుడు ఈ ట్వీట్స్ ప్రభావం సినిమాపైనే కాకుండా సినిమాకు పనిచేసిన హీరోలపై కూడా పడే అవకాసం ఉందని భయపడ్డ..హీరో శ్రీవిష్ణు ఆ తప్పు వెంటనే సరిదిద్దుకోవటం కోసం ట్వీట్స్ చేసారు.

శ్రీ విష్ణు స్పందిస్తూ… ప్ర‌తి సమీక్షకుడు అభిప్రాయాన్ని గౌర‌విస్తానని ట్వీట్ చేశాడు. ప్ర‌తి రివ్యూ స‌మంజ‌స‌మైన‌దే, మ‌రో సినిమాతో మిమ్మ‌ల్ని మెప్పిస్తాన‌ని శ్రీవిష్ణు అని తన గౌరవం నిలబెట్టుకున్నారు.