సంచలన నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పేరుతో టాలీవుడ్‌లో కలకలం సృష్టించి ఆ తరువాత కోలీవుడ్‌లోనూ రచ్చ చేసిన విషయం తెలిసిందే.
జనాలకు కిక్కిచ్చే వార్తలు, ఫొటోలు అందించటంలో శ్రీరెడ్డి ఎప్పుడూ ముందుంటుంది. సోషల్ మీడియా ఎప్పుడైనా కాస్తంత డల్ అయ్యితే తన అందచందాలు ఆరబోసి హాట్ గా మారుస్తుంది. అదీ కాకపోతే ఏదో ఒక వివాదాస్పద వార్తను ముందుంచి ఉత్సాహపరుస్తుంది. ఇనిస్ట్రగ్రమ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ని ఆమె చాలా తెలివిగా వాడుకుంటూంటుంది.
కాస్టింగ్ కౌచ్ ఇష్యూతో సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని రోడ్డుకు ఈడ్చిన శ్రీరెడ్డి తన పాత ధోరణిలోకి వెల్లిపోయింది. తన అందచందాలు, నడము ముడుతలు కనపడేలా చీర కట్టుతూ ఎక్సపోజింగ్ చేసింది. అయితే ఇది శ్రీరెడ్డి ని ఆరాధించే వాళ్లకు ఆనందం కలిగిస్తోంది కానీ, కాస్టింగ్ కౌచ్ ఇష్యూతో ఆమెను అభిమానించే వారికి ఇబ్బందికలిగిస్తోంది. ఇప్పుడు ఆమె పోస్ట్ లకు , వీడియోలకు లైక్స్,షేర్స్ వస్తున్నాయనటంలో సందేహం లేదు.
రీసెంట్ గా ఇక దక్షిణ భారత నటీనటుల సంఘంలోని ఒక సభ్యుడిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ నిన్ను వదిలి పెట్టేది లేదని హెచ్చరించింది. ఒక టీవీలో మీ ప్రసంగాన్ని విన్నాను. అసలు రూపాన్ని మరచి నంగనాసి కబుర్లు బాగానే చెబుతున్నారు. నీ అసలు రంగు బయట పెడతాను. నా వద్ద ఆధారాలు ఉన్నాయి. పరిశ్రమలోని ప్రముఖ నటీమణుల నుంచి సహాయ నటీమణుల వరకూ ఎలా లైంగికవేధింపులకు గురిచేస్తున్నారన్న ఆధారాలు నా వద్ద ఉన్నాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించిన శ్రీరెడ్డి, గత కొద్ది నెలలగా తమిళ సినీ ఇండస్ట్రీలో చిచ్చు రేపింది. తమిళ్ లీక్స్ పేరుతో శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలు తమిళ చిత్ర పరిశ్రమలో పెను భూకంపమే క్రియేట్ చేస్తున్నాయి. మురగదాస్, శ్రీరామ్, రాఘవ లారెన్స్, సందీప్ కిషన్, సుందర్. సి… ఇలా ఇండస్ట్రీలో పేరున్న వారిపైనే ఆరోపణలు చేసారు శ్రీరెడ్డి. ఇప్పుడు ఆమె తనను ఓ తమిళ స్టార్ ..తన జీవితాన్ని నాశనం చేయబోతున్నారంటూ ఫేస్ బుక్ పోస్ట్ పెట్టింది.