నువ్ చచ్చినా క్షమించను.. సురేష్ బాబుపై శ్రీ రెడ్డి ఫైర్

Sri Reddy Fires On Suresh babu

దగ్గుబాటి కుటుంబంపై శ్రీ రెడ్డి చేయని పద ప్రయోగం, పెట్టని శాపం లేదు. దగ్గుబాటి అభిరామ్ తనను వాడుకుని మోసం చేశాడని శ్రీ రెడ్డి అప్పట్లో మీడియాకెక్కిన సంగతి తెలిసిందే. ఇక అభిరామ్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. సంచలనం సృష్టించిన శ్రీ రెడ్డి ఆపై కాస్త సైలెంట్ అయింది. సమయం సందర్భం దొరికప్పుడు శ్రీ రెడ్డి తన పంజా విప్పుతుంది. సురేష్ బాబు, అభిరామ్‌పై నిప్పులు చెరుగుతుంది. తాజాగా రానా పెళ్లిపై స్పందిస్తూ.. శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్ చేసింది.

Sri Reddy Fires On Suresh babu
Sri Reddy Fires On Suresh babu

రానా-మిహీకల పెళ్లికి కంగ్రాట్స్ తెలుపుతూ.. దగ్గుబాటి ఫ్యామిలీపై కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో పాత విషయాలను మళ్లీ గుర్తుకు చేసింది. అందులో భాగంగా వెంకటేష్, సురేష్ బాబుల మధ్య తేడా కూడా చెప్పుకొచ్చింది. దగ్గుబాటి ఫ్యామిలీలో తనకు, తన కుటుంబానికి బాగా నచ్చేవాళ్లు ఎవరు అంటే.. హీరో వెంకటేష్ అని చెప్పుకొచ్చింది. ఎవ్వరి జోలికి వెళ్లరు.. ఏ హీరోయిన్‌తోనూ ఎఫైర్ కూడా వినిపించలేదని పొగిడింది. అయితే తన విషయంలో మాత్రం స్పందించకపోవడం బాధ పెట్టిందని శ్రీ రెడ్డి పేర్కొంది.

సురేష్ బాబు క్యారెక్టర్ చాలా అసహ్యంగా అనిపిస్తుందని చెప్పుకొచ్చింది. మీటూ గురించి మాట్లాడుతూ… ఈ సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ఎక్కడైనా ఇలాంటి సమస్య ఉంది.. అది సర్వసాధారణమని కొడుకుని వెనకేసుకుని మాట్లాడినప్పటి నుంచి అసహ్యం పెరిగిపోయిందని చెప్పుకొచ్చింది. సొంత కొడుకుని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడిన మిమ్మల్ని జన్మలో క్షమించను.. మీరు చచ్చిపోయినా క్షమించను అంటూ ఫైర్ అయింది.