ద్యావుడా..అప్పుడే శ్రీముఖి మొదలెట్టేసిందా?

ద్యావుడా..అప్పుడే శ్రీముఖి మొదలెట్టేసిందా?

గత కొంతకాలంగా మీడియాలో రకరకాల పోగ్రామ్ లు చేస్తూ హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న శ్రీముఖి కు తనను తాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో బాగా తెలుసు. ఆ అనుభవం మొత్తం తాజాగా ఆమె కమిటైన బిగ్ బాస్ షోకు చూపబోతోంది. బిగ్ బాస్ తెలుగు 3లో పార్టిసిపేట్ చేసే 14 మంది కంటెస్టెంట్లలో యాంకర్ శ్రీముఖి ఉండబోతున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.

తను ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్న విషయాన్ని ప్రకటించిన ఆమె… నెల కిందటే ట్విట్టర్‌లో తనకు సపోర్ట్ చెయ్యమంటూ… శ్రీముఖి ఆర్మీ పేరుతో క్యాంపెన్ మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ ఆర్మీ సోషల్ మీడియాలో దుమ్మురేపుతూ షాకిస్తోంది.

గతంలోనూ ‘కౌశల్ ఆర్మీ’, ‘గీతా మాధురి ఆర్మీ’, ‘దీప్తి సునైనా ఆర్మీ’ ఇలా చాలా రకాల ఆర్మీలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఈ ఆర్మీల ప్రభావంతోనే కౌశల్ విన్నర్‌గా గెలిచాడనే ప్రచారం కూడా ఉన్న సంగతి తెలిసిందే.

కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా ‘బిగ్ బాస్’ సీజన్-3 సందడి చేయనుంది. ఈ నెల మూడో వారం నుంచి ప్రసారం కాబోతుందని ప్రచారం జరుగుతోన్న ‘బిగ్ బాస్’ సీజన్-3లో.. 14 మంది కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు. వంద రోజుల పాటు జరిగే ఈ షోలో ఈసారి బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారట నిర్వహకులు.