‘బాహుబలి’తో నెట్ ఫ్లిక్స్ స్కెచ్..తేడా కొడుతోందే

అమిజాన్ ప్రైమ్ కు పోటీగా నెట్ ఫ్లిక్స్ తెలుగులోకి రావటానికి ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో ఇప్పటికే నిలదొక్కుకునే ప్రాసెస్ లో భారీ ప్రాజెక్టులు మొదలెట్టిన నెట్ ఫ్లిక్స్ ..తెలుగులోనూ భారీ అడుగులే వేయాలని ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా తెలుగులో ఈ మధ్యకాలంలో కనీవిని రీతిలో కలెక్షన్స్ సాధించిన బాహుబలి అండ తీసుకోవాలని ఫిక్స్ అయ్యింది.

ఈ మేరకు బాహుబలికి ప్రీక్వెల్ గా ప్రముఖ రచయత ఆనంద్ నీలకంఠన్ రాసిన  ది రైజ్ ఆఫ్ శివగామి నవల రైట్స్ ని తీసుకుంది. అందులో యంగ్ శివగామి పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. శివగామి ఎవరు..అసలు ఆమెకు ఈ మాహిష్మతి రాజ్యానికి సంభంధం ఏమిటనే
యాంగిల్ ఆ కథలో రివీల్ అవుతుంది. అయితే ఈ నవల..పెద్దగా క్లిక్ అవ్వలేదు. రాజమౌళి ఈ నవలను కొంతమేరకు పబ్లిసిటీ చేసినా ఫలించలేదు. దాంతో ఈ నవల రైట్స్ తో వెబ్ సీరిస్ చేయటం అనే విమర్శలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

 అయితే నవల రైట్స్ తీసుకున్న నెట్ ఫ్లిక్స్ …మార్పులు చేర్పులుతో కొత్త స్క్రీన్ ప్లే రాయమని తెలుగు యంగ్ దర్శకులు ప్రవీణ్ సత్తారు, దేవకట్టాలకు అప్పచెప్పినట్లు సమాచారం. మూడు దఫాలుగా ఉండే ఈ వెబ్ సిరీస్ కు “బాహుబలి యూనివర్సల్” అనే పేరును పెట్టారు. ఈ మేరకు   నెట్ ఫ్లిక్స్ తో ఆర్కా మీడియా సంస్థ భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

 ఇప్పటికే “గ్యాంగ్ స్టార్స్”పేరిట జగపతిబాబు, శివాజీలతో నందినిరెడ్డి ఒక వెబ్ రీస్ తీసిన సంగతి తెలిసిందే. దీని బాటలోనే ఇప్పుడు “బాహుబలి” చిత్రం కూడా వెబ్ సిరీస్ లో రావటం అభిమానులకు ఆనందపరిచే అంశమే.