సీనియర్ దర్శకుడు బీమనేని శ్రీనివాసరావు డైరక్షన్ లో అల్లరి నరేష్ , సునీల్ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి
నిర్మాణంలో కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న విడుదలైయింది. కామెడీ సినిమా కావటంతో బి.సి సెంటర్స్ లో మరియు సింగిల్ స్క్రీన్స్ లో ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ ని రాబట్టుకోగలిగింది. కానీ రిలీజైన రోజు నుంచే నెగిటివ్ టాక్ రావటంతో డ్రాప్ స్టార్టైంది. అది ఎంతదాకా వెళ్లింది అంటే క్లోజింగ్ కలెక్షన్స్ తో డిజాస్టర్ అనిపించుకునేటంత.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం… క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే…ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ షేర్ ..3.50 కోట్లు తెచ్చుకుంది. మొత్తం
5.50 కోట్ల బిజినెస్ జరిగింది. దాదాపు అరవై శాతం మాత్రమే రికవరీ అయ్యింది. దానికి తోడు సగానికి సగం ఏరియాలు…నిర్మాతే స్వయంగా రిలిజ్ చేసుకున్నారు. అల్లరి నరేష్ ,సునీల్ లకు ఇది హాట్రిక్ ప్లాఫ్ . నరేష్ ..ఇంట్లో దెయ్యం నాకేం భయం, మేడ మీద అబ్బాయి , సునీల్ కు అయితే ఉంగరాల రాంబాబు, 2 కంట్రీస్ లు డిజాస్టర్ అయ్యాయి. ఇది ఇద్దరికీ మూడో సినిమా. అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా చిత్రశుక్ల నటించగా సునీల్ కి జోడిగా పూర్ణ నటించింది.