జాతీయ అవార్డ్ మిస్స‌యినా చ‌ర‌ణ్‌ ఉత్త‌మ న‌టుడే!

జాతీయ అవార్డు మిస్స‌యినా..!?

ఖ‌తార్ దోహాలో సైమా 2019 అవార్డుల కార్య‌క్ర‌మం క‌ల‌ర్ ఫుల్ గా సాగిన సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి.. కంప్లీట్ స్టార్ మోహ‌న్ లాల్ ముఖ్య అతిధులుగా రెండ్రోజుల పాటు వైభ‌వంగా ఈ వేడుక సాగింది. అతిధులు ఇద్ద‌రూ విజేత‌ల‌కు అవార్డులు అంద‌జేశారు. ఈసారి సైమాలో `రంగ‌స్థ‌లం` చిత్రం హ‌వా సాగింది. ఈ సినిమాకి ఏకంగా తొమ్మిది అవార్డులు ద‌క్కాయి. జాతీయ అవార్డ్ మిస్స‌య్యింద‌న్న అసంతృప్తి మెగాభిమానుల్లో ఉన్నా చ‌ర‌ణ్ ఉత్త‌మ న‌టుడు అంటూ సైమా డిక్లేర్ చేయ‌డం ఆస‌క్తిక‌రం. అలాగే సైమాలో మ‌హాన‌టి.. ఆర్.ఎక్స్ 100 చిత్రాల‌కు మూడేసి అవార్డుల చొప్పున ద‌క్కాయి.

సైమా ఉత్త‌మ న‌టుడుగా రామ్ చ‌ర‌ణ్ (రంగ‌స్థ‌లం) కి పుర‌స్కారం ద‌క్కింది. అలాగే ఉత్త‌మ న‌టిగా కీర్తి సురేష్‌(మ‌హాన‌టి).. ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా సుకుమార్(రంగ‌స్థ‌లం).. పుర‌స్కారాలు ద‌క్కించుకున్నారు. ఉత్త‌మ చిత్రంగా మ‌హాన‌టి అవార్డు అందుకుంది. ఉత్త‌మ న‌టుడు-ఉత్త‌మ ద‌ర్శ‌కుడు- ఉత్త‌మ స‌హాయ న‌టి (అన‌సూయ‌)- ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు (దేవీశ్రీ‌)- లిరిక్స్(చంద్ర‌బోస్.. ఎంత స‌క్కంగున్నావే)- సినిమాటోగ్ర‌ఫీ(ర‌త్న‌వేలు)- క‌ళాద‌ర్శ‌క‌త్వం (రామ‌కృష్ణ‌-మౌనిక‌)- క్రిటిక్స్ ఉత్త‌మ న‌టి (స‌మంత‌)-ఉత్త‌మ గాయ‌ని (ఫీమేల్)- ఎం.ఎం.మాన‌సి (రంగ‌మ్మ మంగ‌మ్మ‌) విభాగాల్లో రంగ‌స్థ‌లం చిత్రానికి పుర‌స్కారాలు ద‌క్కాయి.

<

p style=”text-align: justify”>క్రిటిక్స్ ఉత్త‌మ న‌టుడు – విజ‌య్ దేవ‌ర‌కొండ (గీత గోవిందం).. ఉత్త‌మ స‌హాయ న‌టుడు – రాజేంద్ర ప్ర‌సాద్(మ‌హాన‌టి).. ఉత్త‌మ ప‌రిచ‌య న‌టుడు- క‌ళ్యాణ్ దేవ్ (విజేత‌).. ఉత్త‌మ ప‌రిచ‌య న‌టి -పాయ‌ల్ రాజ్ పుత్ (ఆర్.ఎక్స్ 100).. ఉత్త‌మ ప‌రిచ‌య ద‌ర్శ‌కుడు -అజ‌య్ భూప‌తి(ఆర్.ఎక్స్100).. ఉత్త‌మ క‌మెడియ‌న్ -స‌త్య (ఛ‌లో).. ఉత్త‌మ న‌టుడు (నెగెటివ్ రోల్)- శ‌ర‌త్ కుమార్ (నా పేరు సూర్య‌).. ఉత్త‌మ గాయ‌కుడు (మేల్)- అనురాగ్ కుల‌క‌ర్ణి (పిల్లా రా-ఆర్.ఎక్స్ 100).. పాపుల‌ర్ సెల‌బ్రిటీ ఇన్ సోష‌ల్ మీడియా – విజ‌య్ దేవ‌ర‌కొండ పుర‌స్కారాలు ద‌క్కించుకున్నారు.