షాకింగ్ : “NBK 108” కోసం ఊహించని స్థాయిలో బడ్జెట్ పెడుతున్నారా.??

గత ఏడాది ముగింపు నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు మాత్రం నందమూరి ఫ్యాన్స్ కి నాన్ స్టాప్ ధమాకా అని చెప్పాలి. గత ఏడాదిలో చివరి నెల డిసెంబర్ లో రిలీజ్ అయ్యిన “అఖండ” తో నందమూరి నటసింహం బాలకృష్ణ భారీ హిట్ అందుకోగా ఈ చిత్రం తర్వాత మళ్ళీ మార్చ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన భారీ హిట్ RRR సెన్సేషన్ ని నమోదు చేసింది.

ఇక దీని తర్వాత మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన “బింబిసార” కూడా భారీ హిట్ కావడం యాదృచ్చికంగా బాగా జరిగాయి. దీనితో అయితే నందమూరి ఫ్యాన్స్ కి ట్రిపుల్ ధమాకా దక్కగా ఇప్పుడు బాలయ్య నటిస్తున్న 108వ సినిమాపై ఓ షాకింగ్ గాసిప్ అయితే బయటకి వచ్చింది.

ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ బాలయ్య కెరీర్ లో అత్యధిక బడ్జెట్ పెడుతున్నారట. సినీ వర్గాల సమాచారం ప్రకారం అయితే ఏకంగా 80 కోట్లు బడ్జెట్ ని ఈ సినిమాకి మేకర్స్ కేటాయించారట. రీసెంట్ గానే క్రేజీ అనౌన్సమెంట్ తో వచ్చిన ఈ చిత్రంని దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించనున్నాడు.

అలాగే షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అయితే గతంలో బాలయ్య “అఖండ” సినిమాకి గాను ద్వారకా క్రియేషన్స్ వారు సుమారు 70 కోట్లు పెట్టినట్టుగా తెలిసింది. ఇప్పుడు ఈ సినిమా కోసం ఏకంగా 80 కోట్లు అంటే చిన్న విషయం కాదని చెప్పాలి. మరి ఈ సినిమా ఏ లెవెల్లో ఉంటుందో..