వైరల్ : “చెన్నకేశవ రెడ్డి” షో లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బాలయ్య ఫ్యాన్స్ వీరంగం.!

తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి ఎన్నో ప్రముఖ సినీ కుటుంబాల్లో నందమూరి కుటుంబం కూడా ఒకటి. అయితే నందమూరి కుటుంబంలో కూడా ఏవేవో చీలికలు స్పర్థలు ఉన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. కానీ తర్వాత ఎన్టీఆర్, బాలకృష్ణ సహా కళ్యాణ్ రామ్ లు కలిసే ఉన్నారని చూపించారు.

కానీ అనుకోని విధంగా ఇప్పుడు అభిమానుల్లో షాకింగ్ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్ గానే ఏపీలో జరిగిన రాజకీయాల్లో నందమూరి అభిమానులు హీరోలు చాలా ముభావంగా ఉన్నారు. ఈ సమయంలో బాలయ్య నటించిన మాస్ హిట్ చెన్నకేశవరెడ్డి సినిమా రీ రిలీజ్ ని తెలుగు రాష్ట్రాల్లో కూడా చేసుకున్నారు.

అలా చేసుకున్న ఓ థియేటర్ దగ్గర సినిమా చూసేందుకు వచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బాలయ్య అభిమానులు షాకిచ్చారు. ఎన్టీఆర్ పై పలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డారు. దీనితో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ గా మారాయి.

దీనితో బాలయ్య సీనియర్ అభిమానులు మాత్రం ఎందుకో ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఇంకా దూరంగానే ఉన్నారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.