శర్వా ‘రణరంగం’ – ఫస్ట్ లుక్ ఎలా ఉందంటే…

పడి పడి లేచే మనసు తర్వాత గ్యాప్ తీసుకున్న శర్వానంద్ తన కొత్త సినిమాని సిద్దం చేస్తున్నాడు. క్రైమ్ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారిన దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ మూవీ టైటిల్ ఇవాళ సాయంత్రం ఫస్ట్ లుక్ తో పాటు విడుదల చేసారు.

దాంతో శర్వానంద్ కొత్త సినిమా రణరంగం అఫీషియల్ గా ఎనౌన్ల్ చేసినట్లైంది. ఈ పోస్టర్ లుక్ విషయానికి వస్తే చాలా రఫ్ లుక్ తో ఏజ్డ్ పాత్రలో శర్వానంద్ ఎవరూ ఊహించని విధంగా ఉన్నారు. దాంతో ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర గ్యాంగ్ స్టర్ గా ఎదిగి తన జీవితంలోని కీలక దశలను ఎలా దాటాడు అనే దాని మీద ఉండబోతోందని ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు. గాడ్ ఫాదర్ లుక్ ని తలపించిన శర్వా కళ్ళలో ఎక్స్ ప్రెషన్స్ లో అదే ఇంటెన్సిటీ చూపించారు.

ఇక ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 1990 ప్రాంతంలో వైజాగ్ లో మొదలైన రణరంగం విదేశాలకు వెళ్లి తన కనుసైగతో ప్రపంచ నేర సామ్రాజ్యాన్ని శాశించే స్థాయికి ఎలా తీసుకెళ్ళింది అనే స్టోరీ లైన్ చుట్టూ రణరంగం రూపుదిద్దుకున్నట్టుగా టాక్. రీసెంట్ గా జెర్సీతో సూపర్ సక్సెస్ అందుకున్న సితార బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఆగస్ట్ 2 రిలీజ్ డేట్ లాక్ చేస్తూ ఇందులోనే కన్ఫర్మేషన్ ఇచ్చేశారు.