ప్రుభుదేవా పాటకు అర్జున్ రెడ్డి స్టెప్పులు  

                                                                     (ధ్యాన్)

1990ల్లో కుర్ర‌కారుని ఊపు ఊపిన పాట‌ల్లో ఊర్వ‌శి ఊర్వ‌శి .. పాట ఒక‌టి. శంక‌ర్ డైరెక్ష‌న్‌లో ప్ర‌భుదేవా హీరోగా న‌టించిన ‘ప్రేమికుడు’ చిత్రంలోని పాట ఇది. ఇప్పుడు ఈ పాట‌ను బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌బోతున్నారు. అది కూడా బాలీవుడ్ అర్జున్ రెడ్డి రీమేక్ కోస‌మే. షాహిద్ క‌పూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతోంది. ఈ పాట‌లో కియరా అద్వాని న‌టించ‌బోతోంది. ఈ పాట‌ను యో యో హ‌నీ సింగ్ ఈ రీమిక్స్ సాంగ్‌ను కంపోజ్ చేశారు. చాలా వ‌ర‌కు లిరిక్స్ అన్నీ మార్చేశార‌ట‌. సంజ‌య్ ఈ పాట‌కు కొరియోగ్ర‌ఫీ అందించ‌నున్నారు.