బోల్డ్  రోల్ లో  సీనియర్ ట్రెడిషినల్ హీరోయిన్ !     

ఒకప్పటి తెలుగు ట్రెడిషినల్ హీరోయిన్ అంటే ముందుగా గుర్తుకువచ్చేది బొద్దు గుమ్మ రాశినే. మెయిన్ గా ‘నిజం’ లాంటి సినిమాలో హాట్ బ్యూటీగా నటించిన ఈ సీనియర్ హీరోయిన్.. చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ అలాంటి పాత్రలో నటించబోతుంది. రాశికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉండటంతో… మొత్తానికి తనకున్న ఆ గుర్తింపును క్యాష్ చేసుకోవడానికి పాపం రాశి శాయశక్తులా ప్రయత్నాలు చేసినా ఈ ముదురు హీరోయిన్ కి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఏదో డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు కదా అని.. ఫేక్ ప్రోడక్ట్స్ పై చేసిన యాడ్స్ లో నటించి చివరకి కేసులు కూడా పెట్టించుకుని చాలానే అవమానాలు పడింది.

పైగా అందరి లాగే తను కూడా డిజిటల్ సంపాదనను రాబట్టుకోవాలని ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా పెట్టి, తనకొచ్చిన ఆ రెండు మూడు వంటలతో పాటు కొన్నివిషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంది. ఈ మధ్యలో రాశి బాగానే స్లిమ్ అయిపోయి.. బోల్డ్ కైనా హాట్ హాట్ సీన్స్ కైనా ఇక నుండి రెచ్చిపోతానని.. రాశి డైరెక్టర్లకు లీకులు ఇస్తుందని ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం ఓ కొత్త మూవీలో సెక్సీ లేడీ ఆఫీసర్ పాత్ర చేస్తున్న రాశి, తనలోని బొద్దు తనాన్ని కూడా సగానికి తగ్గించుకుంది. మరి యంగ్ హీరోయిన్ లా తయారైంది.

సడెన్ గా ఇలా మారడానికి ఈ సీనియర్ బ్యూటీకి మరో హాట్ రోల్ వచ్చిందని… హీరో నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రీమేక్ రానున్న ‘అంధాదూన్’లో నెగెటివ్ అండ్ బోల్డ్ రోల్ చేసిన ‘టబు’ పెర్ఫార్మెన్స్ చాలా కీలకం. కాగా ఇప్పుడు టబు నటించిన ఆ బోల్డ్ క్యారెక్టర్ లో నటించమని రాశికి ఛాన్స్ వచ్చిందట. పైగా రాశి ఈ సినిమాలో లేటు వయసులో కూడా అందాల ప్రదర్శనకి గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. అయితే బోల్డ్ సీన్స్ లో నటించడానికి రాశి పెద్ద మొత్తంలోనే డబ్బును డిమాండ్ చేస్తోందట .