శేఖర్‌ కమ్ముల ఫ్యాన్స్ కు శుభవార్త,కొత్త చిత్రం మొదలైంది

శేఖర్ కమ్ములకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాల కోసం ఎదురుచూసే సినిమా లవర్స్ ని ఆయన ఎప్పుడూ నిరాశపరచలేదు. రీసెంట్ గా వచ్చిన ఫిదా వారిని మరింత ఆనందపరిచింది. దాంతో ఆయన తదుపరి చిత్రం కోసం ఎదురచూపులు మొదలయ్యాయి. కానీ శేఖర్ కమ్ముల ఓ పట్టాన కొత్త చిత్రం మొదలెట్టే మనిషి కాదు.

తను అనుకున్న రీతిలో పూర్తి డిటైలింగ్ తో స్క్రిప్టు పూర్తయ్యే దాకా ఆయన సినిమా లాంచింగ్ కూడా చేయరు. అయితే ఆ క్షణాలు వచ్చేసాయి. ఫిదా రిలీజైన దాదాపు 16 నెలలు తర్వాత ఆయన కొత్త చిత్రం లాంచ్ చేసారు. ఈ రోజే ఆ సుముహూర్తం.

హైదరాబాద్ లోని ఆసియన్ సినిమాస్ ప్రొడక్షన్ ఆఫీస్ లో ఈ కొత్త చిత్రం ప్రారంభమైంది. ప్రముఖ పంపిణీదారుడు సునీల్ నారంగ్ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు. ఇంతకుముందు లాగా ఈ సారి కూడా ఓ కొత్త కుర్రాడుని ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూట్ మొదలు కానుందని సమాచారం. 2019 సమ్మర్ కు ఈ సినిమాని రిలీజ్ చేయాలని శేఖర్ కమ్ముల ఆలోచన.

శేఖఖర్ కమ్ముల ..ఈ సారి పూర్తిగా సంగీత భరిత చిత్రంగా తన కొత్త చిత్రాన్ని మలచాలని భావిస్తున్నారు. అందుకోసం ఆయన కొన్ని ట్యూన్స్ ని కూడా రెడీ చేసినట్లు సమాచారం. నారాయణదాస్‌ నారంగ్‌, పి.రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు.