నటసింహ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఇప్పటివరకూ ఎన్నో కథనాలు వెలువడ్డాయి. అదిగో పులి ఇదిగో తోక అన్నడం తప్ప! అందులో ఏదీ అధికారికం కాదు. దానికి తగ్గట్టు మోక్షజ్ఞ కూడా సినిమాలపట్ల ఆసక్తిగా లేడు అనడానికి కొన్ని సాక్ష్యాలు కూడా ఇటీవల బయటపడ్డాయి. దీంతో నిజంగానే మోక్షజ్ఞకి సినిమాలంటే ఆసక్తి లేదా? అనిపించిన కథనాలు అంతే వేడెక్కించాయి. తాజాగా అలాంటిదేమీ లేదంటూ బాలయ్య అసలు విషయం చెప్పారు. మోక్షజ్ఞ కోసం ఇప్పటికే కొన్ని స్ర్కిప్ట్ లు లాక్ చేసినట్లు బాలయ్య వెల్లడించారు. అన్ని తానే స్వయంగా ఎంపిక చేసిన కథలని..అందులో ది బెస్ట్ స్ర్కిప్ట్ ఒకటి డెబ్యూ గా తీసుకుంటామని తెలిపారు.
అయితే దర్శకుడిగా ఇంకా ఎవర్నీ ఫైనల్ చేయలదన్నారు. ఇంతలో యాంకర్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అనుకుంటు న్నారా? అంటే బాలయ్య తనదైన శైలిలో బధులిచ్చారు. పూరి నో..ఇడ్లీనో ఎవరో ఒకరు డైరెక్టర్ చేయాలి కాబట్టి…ఆ పనుల్లో కూడా తలమునకలవుతానని తెలిపారు. కానీ అందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఎట్టకేలకు మోక్షజ్ఞ ఇంట్రీపై బాలయ్య నోటే ఓ క్లారిటీ దొరకడంతో అభిమానాలు ఆనందానికి అవధులు లేవ్. బాలయ్య వారసత్వాన్ని పెద్ద తెరపై చూసుకోవాల నుకుంటోన్న అభిమానులందరికీ ఇది గుడ్ న్యూస్. ఇప్పటికే మోక్ష డెబ్యూ చిత్రానికి పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి.
పూరి జగన్నాథ్, సింగీతం శ్రీనివాసరావు, క్రిష్, బోయపాటి సహా కొంత మంది రచయిత పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అందులో బాలకృష్ణకు బాగా నచ్చిన రచయిత సాయి మాధవ్ బుర్రా పేరు కూడా వినిపించింది. ఇతను గౌతమీపుత్రశాతకర్ణి, సైరా నరసింహారెడ్డి, కృష్ణంవందే జగద్గురం, ఎన్టీఆర్ కథనాయకుడు, మహానాయకుడు చిత్రాలకు మాటలు రాసారు. ఆయన పేరు ప్రముఖంగా చర్చకొచ్చింది. మరి బాలయ్య మనసులో ఎవరున్నారో? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతన్నారు. షూటింగ్ లకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.