KGF2: వెస్ట్ర‌న్ మాఫియా డాన్ లా చించాడుగా

కన్నడ స్టార్ యష్ న‌టించిన‌ బ్లాక్ బస్టర్ చిత్రం KGF .. ఈ సినిమాకి ప్రీక్వెల్ గా KGF చాప్టర్ 2 పార్ట్ 1 కంటే భీక‌రంగా ఉంటుంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వెల్ల‌డించారు. పెద్ద స్పాన్ తో భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు. అంచ‌నాల్ని అందుకునేందుకు పెద్ద స్టార్ల‌ను బ‌రిలో దించారు. పాన్ ఇండియా స్కేల్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ ముఖ్యమైన పాత్రల కోసం బాలీవుడ్ ఖ‌ల్ నాయ‌క్ సంజయ్ దత్ .. వెట‌రన్ నాయిక‌ రవీనా టాండన్ లను ఎంపిక చేసుకున్నారు.

సంజయ్ దత్ ఇందులో అధీరా అనే విల‌న్ పాత్ర‌లో న‌టించారు. ఇంత‌కుముందు ఆయ‌న లుక్ కూడా రిలీజైంది. దానికి అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. గుబురు గడ్డం కోర‌మీసాల‌తో సంజయ్ దత్ కొత్త లుక్ ఒక‌టి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లీకైన ఈ ఛాయాచిత్రంలో సంజు కొత్త కేశాలంకరణతో కనిపిస్తాడు. సంజయ్ కళ్ళు రెడ్ షేడెడ్ గా క‌నిపిస్తుండ‌డం చూస్తుంటే.. భీక‌ర‌మైన పాత్ర‌లోనే ఆయ‌న న‌టిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. వెస్ట్ర‌న్ మాఫియా డాన్ కి జెరాక్స్ కాపీలా ఉన్నాడు ద‌త్.

మరోవైపు, ఈ చిత్రం దసరా విడుదలకు షెడ్యూల్ చేసినా లాక్డౌన్ కారణంగా సాధ్య‌ప‌డ‌ద‌నే భావిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ నిలిచిపోయింది. ముప్పై రోజుల షూట్ ఇంకా పూర్తి కాలేదు. క్రైసిస్ లోనూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. శ్రీనిధి శెట్టి కథానాయికగా న‌టించ‌గా.. రవి బస్రురు సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని విజయ్ కిరంగదూర్ తన హోంబ‌లే ఫిల్మ్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.

https://twitter.com/bhrtww/status/1263306997308567570