యశ్వంత్, అక్రితా ఆచార్య జంటగా అనిత క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా సమీరం. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని ఆగస్ట్ 31న విడుదల కానుందని నిర్మాత అనితా దేవేందర్ రెడ్డి తెలిపారు. ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్ మాదిరే తమ సమీరం కూడా ఉంటుందని ధీమాగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన పాటలకు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. కొత్త వాళ్లైనా కూడా హీరో హీరోయిన్‌లు బాగా నటించారని చెప్పారు దర్శకడు రవి గండబోయిన. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసకుని ఆగస్ట్ 31న ఈ చిత్రం విడుదల కానుంది.
సంగీతం: యాజమాన్య
కెమెరా: మధుసూధన్ కోట,
ఎడిటింగ్: బంతల నాగేశ్వ ర్ రెడ్డి
పాటలు: రాంబాబు గోశాల
నిర్మాతలు : అనిత దేవందర్ రెడ్డి, సురేష్ కేశవన్, జి. రుక్మిణి
రచన, దర్శకుడు: రవి గండబోయిన