సమంత సూపర్ స్కెచ్…మనకు వేరే దారి లేదు ..‘యు టర్న్’ చూడాల్సిందే

‘లూసియా’ సినిమాతో సృష్టించిన  కన్నడ దర్శకుడు పవన్ కుమార్ దర్శకత్వంలో  తెరకెక్కిన ‘యు టర్న్’ను తెలుగు.. తమిళ భాషల్లో సమంత చేసిన  సంగతి తెలిసిందే.  ద్విభాషల్లోనూ ఈ సినిమాను సమంతే స్వయంగా నిర్మిస్తోంది. ‘లూసియా’ తరహాలోనే యు  టర్న్ కూడా ఓ డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్.

అయితే కన్నడంలో సూపర్ హిట్ అవటంతో తెలుగులో చాలా మంది చూసేసారు. దాంతో  తెలుగులో అదే డైరక్టర్ సినిమా చేస్తుంటే మళ్లీ ఏం చూస్తామనే ఆలోచన వస్తుంది. ఇది పవన్ కుమార్ పసిగట్టినట్లున్నాడు. దానికో సొల్యూషన్ ఆలోచించాడు. అదేమిటంటే..కన్నడ వెర్షన్ కు తెలుగు వెర్షన్ కు క్లైమాక్స్ అరగంట మార్చేయడం.

దాంతో ఎట్టి పరిస్దితుల్లోనూ కన్నడ వెర్షన్ చూసిన వాళ్లు ఈ సినిమాని మిస్  కారు. ఎలాగో తొలి సారి చూసేవాళ్లకు ఈ సినిమా ఫ్రెష్ గానే ఉంటుంది. కన్నడంలో ఓ  సారి చూసేసిన వాళ్లకు కూడా ఈ సినిమా కొత్తగా ఉంటుంది. దీని వల్ల కన్నడ వాళ్లు కూడా ఈ సినిమాని చూసే అవకాసం ఉంది.  సెప్టెంబర్ 13న రెండు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

సస్పెన్స్ థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రంలో సమంత జర్నలిస్ట్ పాత్రలో  నటిస్తోంది. ఈ ఏడాది ‘రంగస్థలం’, మహానటి, అభిమన్యుడుతో వరుస విజయాలను సొంతం  చేసుకొని టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది ప్రముఖ హీరోయిన్ సమంత  అక్కినేని.పవన్‌కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో భూమిక, ఆది పినిశెట్టి, రాహల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్‌స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అదిస్తున్నారు.