‘ఓ బేబీ’ చిత్రం సూపర్ హిట్ తో సమంత చాలా ఉత్సాహంగా ఉంది. దాంతో తన అభిమానులతో తన జీవితంలోని ఓ సీక్రెట్ ని షేర్ చేసుకుంది. ఆ సీక్రెట్ చూసిన అభిమానులు తమ అభిమాన హీరోయిన్ తనపై చూపుతున్న ప్రేమను, అభిమానాన్ని చూసి మురిసిపోతున్నారు. ఇంతకీ ఏమిటా సీక్రెట్ అంటే…
ఓ బేబి చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో సమంత వైట్‌డ్రెస్‌లో మెరిసిపోయింది. ఈ క్రమంలో ఫొటోషూట్‌లో పాల్గొన్న సమంత సోషల్‌మీడియా వేదికగా తన భావాలను అభిమానులతో పంచుకున్నారు.
‘ అత్యుత్తమ జీవితాన్ని గడుపుతున్నాను… ఇన్నాళ్లు ఎవరికీ కనిపించకుండా దాచిన టాటూను ఫైనల్‌గా చూపించేస్తున్నాను. నా భర్త చై నా ప్రపంచం’ అంటూ తన భర్త పేరుతో ఉన్న టాట్టూను రివీల్ చేశారు. ఈ క్రమంలో సమంత ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటో… సమంత అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ పతాకాలపై సమంత అక్కినేని, లక్ష్మి, నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా బి.వి.నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మాతలు. జూలై 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మ్యాజికల్ బ్లాక్ బస్టర్‌గా అటు ప్రేక్షకుల, ఇటు సినీ వర్గ ప్రముఖుల ప్రశంసలు పొందుతూ రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తోంది.