ఆహా షో కోసం సమంత రెమ్యునరేషన్.. చాలా కాస్ట్లీ..

Samantha Akkineni Cute Photos

అక్కినేని సమంత కేవలం ఒక హీరోయిన్ గానే కాకుండా భవిష్యత్తులో హోస్ట్ గా కూడా బిజీ కానున్నట్లు చాలా ఈజీగా అర్ధమయ్యింది. బిగ్ బాస్ షోలో ఒకరోజు హోస్ట్ గా అలా కనిపించి సక్సెస్ అందుకోగానే వెంటనే సామ్ జామ్ అంటూ ఆహా యాప్ కు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. షో కోసం విజయ్ దేవరకొండ, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ కూడా వచ్చారు.

samantha recieved big amount as remuneration for samjam show in aha
sam jam

కేవలం ఒక టాక్ షోలా కాకుండా పేదవాళ్లకు ఎంతో కొంత సహాయం అందేలా కూడా మంచి ప్లానింగ్ తో ముందుకు సాగుతోంది. అయితే ఆ షో కోసం సమంత రెమ్యునరేషన్ గట్టిగానే అందుకుంటోందట. వారానికి 1కోటి రూపాయల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది. మొదటి కోటి కంటే ఎక్కువగానే డిమాండ్ చేసినట్లు టాక్ వచ్చింది. కానీ భవిష్యత్తులో పేమెంట్స్ ఇంక పెరుగుతాయని ముందు ఆహా యాప్ సబ్ స్క్రైబర్స్ నెంబర్ ను పెంచాలనే బాధ్యతను ఆమెపై కూడా మోపినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం షో కోసమే చాలా మంది ఆహా వైపు అలా లుక్కేస్తున్నారు. ఇక భవిష్యత్తులో ఇంకా హై రేంజ్ లో స్టార్స్ ను పిలిపించాలని అనుకుంటున్నారు. హీరోలనే కాకుండా పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వని బ్రహ్మానందం, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళను కూడా షోకు రప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సమంత కొత్త స్టోరీలను మాత్రం రెగ్యులర్ గా వింటున్నట్లు తెలుస్తోంది.