పెద్దయ్యాక ఏమవుతావ్? అంటే ఏ డాక్టరో ఇంజినీరో అని చెబుతుంటారు. కానీ అందాల సమంత మాత్రం కథానాయిక అయ్యింది. అనుకోకుండానే గౌతమ్ మీనన్ జెస్సీ పాత్రకు ఎంపిక చేసి ఆరంభమే సక్సెస్ నిచ్చారు. ఏమాయ చేశావే తర్వాత టాలీవుడ్ లో సమంత కెరీర్ కి ఎదురేలేకుండా పోయింది. దాదాపు పదేళ్ల కెరీర్ లో పీక్స్ చూసింది. స్టార్ హీరోలందరి సరసన నటించేసింది. అయితే ఇదంతా కలలా సాగిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగు-తమిళ్ లో అగ్ర కథానాయికగా రాజ్యమేలుతోంది.
ఇంత ఎదిగినా ఒదిగి ఉంది సామ్. అందుకే ఓసారి పాత మెమరీస్ లోకి వెళ్లిన సామ్ తన చిన్ననాటి ఫోటోని షేర్ చేసి దానికి ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది. ఈ పిక్ లో చిన్నారి సమంతతో పాటు ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు. “మనం వేర్వేరు మార్గాల్లో పెరిగి పెద్దయ్యాం. కానీ, మన మూలాలు మాత్రం ఒకటే. మిమ్మల్ని మిస్సవుతున్నా“ అంటూ వ్యాఖ్యను జోడించింది సామ్. లక్షల్లో లైక్ లు వ్యూస్ తో ఈ పోస్టింగ్ అంతర్జాలంలో షేక్ చేస్తోంది. సామ్ ఈ ఫోటోలో ఎంతో క్యూట్ గా ఉంది. తనతో పాటే ఉన్న ఆ ఇద్దరబ్బాయిలు ఎవరో తనే చెప్పాల్సి ఉంటుంది.
కెరీర్ పరంగా చూస్తే త్వరలోనే సామ్ బాలీవుడ్ లో అడుగు పెట్టనుందని తెలుస్తోంది. గేమ్ ఓవర్ దర్శకుడు తనని ఉత్తరాదికి పరిచయం చేయబోతోతున్నాడు. నయనతారతో ఓ సినిమాలో నటిస్తుండగా విఘ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లోనూ సామ్ సత్తా చాటనుంది.