ఒక్కో చీర ఖరీదు మరీ అంతనా?.. అదే మిహీక, సమంతల రేంజ్!

Samantha And Miheeka Designer Saree Price

ఎవరింట్లో పెళ్లి జరిగినా సరే ముఖ్యంగా అందరూ శ్రద్ద చూపించేది చీరలు, నగల విషయాల్లోనే. ఎవరి స్థాయికి తగ్గట్టు వారు చీరలు, నగలు కొని పెళ్లి తంతును కానిచ్చేస్తుంటారు. అయితే టాలీవుడ్‌ను ఏలే ఓ కుటుంబంలోని వ్యక్తి పెళ్లి అంటే మామూలు విషయమా?. దగ్గుబాటి వారసుడు రానా పెళ్లి వేడుకలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో.. మిహీక, సమంత చీరలు, వాటి డిజైన్స్ అంతకు మించి వైరల్ అయ్యాయి. అయితే ఈ పెళ్లిలో ఎక్కువగా పొందూరు ఖద్దరు, చీరలే వాడినట్టు తెలుస్తోంది. అయితే వీటి ఖరీదు తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.

Samantha And Miheeka Designer Saree Price
Samantha And Miheeka Designer Saree Price

హల్దీ ఈవెంట్ (పసుపు ఫంక్షన్) రోజు మిహీక, సమంతలు ధరించిన దుస్తులు అందరినీ ఆకర్షించాయి. పేరుకు తగ్గట్టుగా పసుపు ఫంక్షన్ కాబట్టి ఎల్లో డ్రెస్‌లే ధరించారు. వాటి ఖరీదు లక్షకు పైగా ఉంటాయని తెలుస్తోంది. ఇక పెళ్లికి ధరించిన దుస్తులు మాత్రం మరో లెవెల్ అని తెలుస్తోంది. పెళ్లి పీఠలపై మిహీక గోల్డెన్, క్రీమ్ కలర్ లెహెంగాలో కనిపించిన విషయం తెలిసిందే. ఆ డ్రెస్ ను ప్రముఖ డిజైనర్ అనామిక ఖన్నా డైజైన్ చేశారట. ఈ డ్రెస్ కోసం మిహీక దాదాపు 6 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.

ఇక పెళ్లిలో సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె ధరించిన చీరపైనే అందరి దృష్టి పడింది. ఇక ఆమె చీర ధర విషయానికి వస్తే.. రా మాంగో డిజైన్ చేసిన ఆ చీర కూడా నీలం రంగుపై ఎంబ్రాయిడరీ చేయించినట్లు తెలుస్తోంది. ధర లక్షకి పైగానే ఉంటుందని సమాచారం. మొత్తానికి దగ్గుబాటి పెళ్లి సందడి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. అదే ఒక వేళ కరోనా, లాక్ డౌన్, కోవిడ్ నిబంధనలే లేకుంటే ఆకాశమే హద్దుగా సంబరాలు జరిగేవి.