ఆర్ఆర్ఆర్ మూవీ.. అస‌లు సీక్రెట్ చెప్పిన రైట‌ర్..!

టాలీవుడ్ జ‌క్క‌న్న రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం తెర‌కెక్కుతున్న తాజా చిత్ర ఆర్ ఆర్ ఆర్. రామ్‌చ‌ర‌ణ్, జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఇత‌ర ఇండ‌స్ట్రీల‌కు సంబంధించి ప‌లువురు స్టార్లు న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆగిపోయిన నేప‌ధ్యంలో, తాజాగా మాట‌ల ర‌చ‌యిన సాయి మాధ‌వ్ బుర్రా ఈ సినిమాకు సంబంధించి అస‌లు సీక్రెట్ రివీల్ చేశారు.

ఇటీవ‌ల‌ ఓ ఇంటర్వ్యూలో భాగంగా రైట‌ర్ సాయిమాధవ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోల‌ పాత్రల ప్రాధాన్యం గురించి వివరించారు. ఒక‌వైపు తార‌క్ మ‌రోవైపు చ‌ర‌ణ్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్స్ చేస్తున్న నేప‌ధ్యంలో, ఇద్ద‌రికీ స‌మాన‌మైన ప్రాముఖ్య‌త ఉంటుంద‌ని, ఇద్ద‌రు హీరోల పాత్ర‌ల నివిడి కూడా స‌మానంగా ఉంటుందని, రాజ‌మౌళి బ్యాలెన్స్ చేసిన విధానం, ఇద్ద‌రి అభినుల‌ను ఆక‌ట్టుకుంటుద‌ని, తాను కూడా ఇద్ద‌రికి స‌మానంగా ప‌వ‌ర్‌ఫుల్ డైలాగులు రాశాన‌ని సాయి మాధ‌వ్ తెలిపారు.

క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ కావ‌డంతో.. నంద‌మూరి, మెగా అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారు.. ఎవ‌రి క్యారెక్ట‌ర్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, రాజ‌మౌళి ఇద్ద‌రిని ఎలా హ్యాండిల్ చేస్తారు.. అనే అనుమానాలు ప్రేక్ష‌కుల్లో ఉంది. అయితే ఇప్ప‌డు సాయిమాధ‌వ్ చెప్పిన విష‌యాన్ని బ‌ట్టి, ఇద్ద‌రు హీరోల ఫ్యాన్స్‌ను ఈ సినిమా నిరాశ‌ప‌ర్చ‌ద‌ని తెలుస్తోంది. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు ఓట‌మే లేని జ‌క్క‌న్న ఈ చిత్రాన్ని ఎలా మ‌లుస్తారో, ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి. ఏది ఏమైనా ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ప‌లు ఇండ‌స్ట్రీ రికార్డులు బ‌ద్ద‌ల‌వ‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.