మెగా ఫ్యామిలీ నుండి వచ్చి తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పర్చుకున్న హీరోలలో సాయిధరమ్‌తేజ్ కూడా ఒకరు. వరుస ఫ్లాపులతో ఢీలా పడిన సమయంలో ప్రతిరోజూ పండగే తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి మళ్లీ స్పీడ్ అందుకున్నాడు. ఇక, తాజా సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’.. డిసెంబర్ 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. థియేటర్లు పునః ప్రారంభమయ్యాక ప్రేక్షకుల ముందుకొస్తున్న పెద్ద సినిమా ఇదే కావడంతో ఇప్పుడు ఇండస్ట్రీ ఫోకస్ మొత్తం ఈ మెగా మేనల్లుడిపైనే ఉంది.
ఈ నేపథ్యంలో తన సినీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు మీడియాతో పంచుకున్నారు. ఒక జోక్ వచ్చినప్పుడు నలుగురితో కలిసి నవ్వితే ఆ ఆనందం వేరని, థియేటర్ అనుభూతి చాలా ప్రత్యేకమైనదని తెలిపారు. ఆ అనుభూతిని పునః సృష్టించి జోష్ నింపడం కోసం కష్టపడుతున్నామన్నారు.
పెళ్లి గురించి మాట్లాడుతూ .. నాకు పెళ్లిపై అంత ఆసక్తి లేదు. కానీ మా అమ్మ సంతోషం కోసం పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అమ్మ ఎప్పుడూ అదే విషయం గురించి మాట్లాడుతుంటే తట్టుకోలేక మంచి అమ్మాయిని చూడమని చెప్పేశా. ప్రస్తుతం సోలో లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పుకొచ్చారు సాయిధరమ్ తేజ్.